Advertisement
ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మనకు టాయిలెట్లు రెండు రకాలుగా కనిపిస్తాయి. ఒకటి ఇండియన్ టైప్. రెండోది వెస్ట్రన్ టైప్. విదేశాల్లో చాలా దేశాల్లో వెస్ట్రన్ టైప్ టాయిలెట్లను ఉపయోగిస్తారు. ఇక మన దేశంలో చాలామంది ఇండియన్ తరహా టాయిలెట్లను వాడుతారు. కొందరు ఇళ్లలో వెస్ట్రన్ టాయిలెట్లు ఉంటాయి. అయితే ఏ టాయిలెట్ సీట్ అయినా సరే దాదాపుగా తెలుపు రంగులోనే ఉంటుంది. అవును..గమనించారు కదా. అయితే టాయిలెట్లు ఎక్కువగా తెలుపు రంగులోనే ఎందుకు ఉంటాయో తెలుసా? దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
టాయిలెట్ సీట్స్ ను సాధారణంగా pource లేయిన్ అనే సెరామిక్ మెటీరియల్ తో తయారు చేస్తారు.అది సహజంగానే తెలుపు రంగులో ఉంటుంది. దానికి ఇతర రంగులను కలపాల్సిన పనిలేదు. పైగా అలా ఉంచితేనే తక్కువ ధర ఉంటాయి. రంగులు కలిపితే దర పెంచాల్సి వస్తుంది. అందుకని వాటిని తయారు చేశాక వాటికి వచ్చే సహజమైన తెలుపు రంగులోనే వాటిని ఉంచుతారు. అలాగే విక్రయిస్తారు. అందుకనే టాయిలెట్ సీట్లు సహజంగానే ఎక్కువగా తెలుపు రంగులో ఉంటాయి.
Advertisement
ఇక తెలుపు కాకుండా మిగిలిన ఏ రంగులో టాయిలెట్ సీట్లు ఉన్నాసరే వాటిపై మురికి సరిగ్గా కనిపించదు. తెలుపు రంగు అయితేనే మురికి సరిగ్గా కనిపిస్తుంది. పైగా తెలుపు రంగుతో ఉన్న టాయిలెట్ సీటును క్లీన్ చేస్తే అది తెల్లగా మెరుస్తోంది. దీంతో సంతృప్తి కలుగుతుంది. ఇతర రంగుల్లో ఉండే టాయిలెట్ సీట్లను శుభ్రం చేసిన తెలుపుల మేరవవు. కనుక సీట్ శుభ్రం అయిందా, కాలేదా అనే విషయం గుర్తించడం కష్టతరం అవుతుంది. అందుకనే టాయిలెట్ సీట్లను సహజంగానే తెలుపు రంగులో ఉండేటట్లు తయారు చేస్తారు. అలాగే విక్రయిస్తారు. అవి ఎక్కువగా తెలుపు రంగులోనే ఉండటం వెనుక ఈ కారణాలు ఉన్నాయి అన్నమాట.
also read;