Advertisement
ఒడిశాలో జరిగిన కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదం ఎన్నో కుటుంబాలకు తీరని ఆవేదన మిగిల్చింది. ఈ ఘటనలో దాదాపు 300 మంది వరకు మరణించారు. మరో 1,175 మంది గాయపడ్డారు. మరణించిన వారిలో చాలా మంది మృతదేహాలు అక్కడే పడి ఉన్నాయి. వాటిని ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది భువనేశ్వర్ ఏయిమ్స్ ఆసుపత్రి సిబ్బంది ఆలోచిస్తున్నాయి. 187 మృతదేహాలను ఎవరివో గుర్తించలేదు.
Advertisement
మరో 72 గంటల పాటు ఉంచుతామని.. ఆ తరువాత ఎవ్వరూ రాకుంటే సామూహిక ఖననాలు చేయనున్నట్టు తెలిపారు. ఒడిశాలో ఇంత ఘోర ప్రమాదం జరిగి అందరూ బాధలో ఉంటే.. కొందరు చిల్లర వ్యక్తులు మాత్రం తమ చేతివాటం ప్రదర్శించారు. పట్టాలపై పడిపోయినటువంటి పర్సులను వెతుకుతూ వాటిలో ఉన్నటువంటి డబ్బులను తీసుకుంటున్నారు. మరికొందరూ చిందర బొందరగా పడిపోయిన ప్రయాణికుల కొత్త దుస్తులు, ఫొటోలు, పర్సులు ఇతర వస్తువులను ఎత్తుకెళ్లారు.
Advertisement
ముఖ్యంగా కూలీనాలి చేసి కష్టపడి సంపాదించిన సొమ్ముతో పిల్లల కోసం ఓ తండ్రి కొన్న కొత్త దుస్తులు.. బతుకుదెరువు కోసం బయలుదేరిన భవన నిర్మాణ కార్మికుడి తాపీ, పెయింటింగ్ బ్రష్ లు, ఇతర పనిముట్లు, తెగిపోయిన చెప్పులు, చిరిగిపోయిన బట్టలు, అక్కడక్కడ ఆనవాళ్లుగా కనిపించే ఆధార్ కార్డులు, పాస్ ఫోర్టు సైజు ఫొటోలు, ఇలా రకరకాల వస్తువులు బహానగా వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదం వద్ద విషాద గుర్తులు చాలా పట్టాలపై కనిపిస్తున్నాయి. అసలు పట్టాలు తప్పింది రైళ్లు కాదు.. వందలాది కుటుంబాలు.. పట్టాలపై పడి ఉన్న వస్తువులే ఇందుకు సజీవ సాక్ష్యం. అక్కడ లభించినటువంటి ఫోన్లను బాధితులకు తిరిగి ఇచ్చే పనిలో పోలీసులున్నారు.
మరికొన్ని ముఖ్య వార్తలు :