Advertisement
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ అంటే తెలియని వారు ఉండరు. ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోలలో ఈయన కూడా ఒకరు. ఆరు పదుల వయసు దాటిన ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాల్లో నటిస్తూ సక్సెస్ లు అందుకుంటున్నారు. తాజాగా బాలకృష్ణ గురించి కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. బాలకృష్ణ చాలా కోపం ప్రదర్శిస్తారని, కోపంతోనే మాట్లాడుతూ ఉంటారని అంటున్నారు.
Advertisement
Also Read: ఫ్యామిలీతో సూర్య విడిపోయారా.. గొడవలకు కారణం ఆవిడేనా..?
అయితే ఇలాంటి మాటలు ఆయనతో కలిసి పని చేయని వారు మాత్రమే మాట్లాడతారని, బాలయ్యతో కలిసి పని చేస్తే ఆయన వ్యక్తిత్వం మనసు ఎలాంటిదో అర్థమవుతుందని ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు బాలయ్య మంచి మనసు గురించి చెప్పారని అన్నారు. ఈ సందర్భంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు సంపాదించుకున్న సీనియర్ నటి లయ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు.. బాలకృష్ణతో చెన్నకేశవరెడ్డి మూవీలో నటించే సమయంలో అవకాశం వచ్చినప్పటికీ కొన్ని కారణాల వలన నటించలేకపోయానని తెలిపారు.
Advertisement
Also Read: జవాన్ లో అల్లు అర్జున్ ఉన్నాడా..? క్లారిటీ వచ్చేసింది..!
అయితే విజయేంద్ర వర్మ సినిమాలో తిరిగి బాలకృష్ణ గారితో నటించే అవకాశం వచ్చిందని అన్నారు. ఈ మూవీలో బాలకృష్ణ గారితో సాంగ్ చేయాల్సి ఉండగా ఈ సాంగ్స్ కి రిహర్సల్స్ చేస్తున్నామని అన్నారు. అలా డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న టైంలో నా వెనక బాలకృష్ణ గారు ఉండటం చూసుకోలేదని, పొరపాటున తన కాళ్ళు తొక్కానని తెలియజేశారు. వెంటనే ఆయనకు చూసుకోలేదు సార్ క్షమించండి అని క్షమాపణ కోరాను,
కానీ బాలకృష్ణ మాత్రం ప్యాకప్ అంటూ షూటింగ్ ప్యాకప్ చెప్పారని లయ తెలియజేశారు. బాలకృష్ణ గారికి కాస్త కోపం ఉంటుందని నేను విన్నాను, నావల్ల ఈరోజు షూటింగ్ క్యాన్సల్ అయింది అంటూ బాధపడుతూ ఉండగా బాలయ్య మళ్ళీ వచ్చి మరేం బాధపడకు ఏదో సరదాగా అన్నానంటూ మరో షాక్ ఇచ్చారని లయ తెలియజేశారు. ప్రస్తుతం లయ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read: టాలీవుడ్ లో అత్యధిక ఇండస్ట్రీ హిట్స్ అందించిన స్టార్ డైరెక్టర్స్ ! ఎవరు ఎక్కువ అంటే ?