Advertisement
నటసింహా నందమూరి బాలయ్య గురించి తెలియని సినీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. నందమూరి తారక రామారావు కొడుకుగా బాలకృష్ణ తెలుగు సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. నటుడిగా, నిర్మాతగా, రాజకీయ వేత్తగా మనందరికీ ఆయన సుపరిచితమే. అయితే బాలకృష్ణకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలకృష్ణ ప్రతి ఒక్క సినిమాలోనూ విగ్గు వాడుతుంటారు అన్న విషయం తెలిసిందే. అయితే బాలకృష్ణ విగ్ గురించి ఆయన పర్సనల్ మేకప్ మెన్ వాసు కొప్పిశెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Advertisement
Read also: టాలీవుడ్ భామలు తమ మొదటి సినిమాల్లో ఎలా ఉన్నారో తెలుసా ?
తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న వాసు బాలకృష్ణ విగ్గుల గురించి మాట్లాడుతూ.. బాలకృష్ణ వాడే విగ్గు ధర ఎంత ఉంటుందనే విషయాన్ని వెల్లడించారు. గతంలో బాలకృష్ణ విగ్గులను ముంబై లేదా చెన్నై నుంచి తెప్పించేవాళ్లం.. కానీ ఇప్పుడు ఆ విగ్గులు హైదరాబాద్ లో కూడా దొరుకుతున్నాయని వెల్లడించారు. అంతేకాదు ఆయన ఉపయోగించే విగ్గులు చాలా ఖరీదైనవని తెలిపారు. నాసిరకం విగ్గులను బాలకృష్ణ ఉపయోగించరట. విగ్గుల కోసమే లక్షల రూపాయలు ఖర్చు చేస్తామని తెలియజేశారు.
Advertisement
అంతేకాక నందమూరి బాలకృష్ణ చాలా అందగాడని.. ఆయన అందానికి కాస్త మెరుగులు దిద్దే ప్రయత్నం చేస్తున్నాను తప్ప అందులో తన పనితనం ఏమీ లేదని ఈ సందర్భంగా వాసు చెప్పుకొచ్చారు. అయితే సినిమాలో ఆయన పాత్ర కోసం ఇలా విగ్గులు మార్చాల్సి ఉంటుంది కనుక ఆ ఖర్చును బాలకృష్ణ అకౌంట్ నుండి కాకుండా నిర్మాత అకౌంట్ నుండి వెళుతుంది. ఎందుకంటే సినిమా కోసం లుక్ సిద్ధం చేయాల్సిన బాధ్యత కాబట్టి నిర్మాత అన్ని దగ్గరుండి చూసుకుంటారట. ఇక బాలయ్య రీసెంట్ గా నటించిన వీర సింహారెడ్డిలో కూడా ఆయన విగ్ హాట్ టాపిక్ అయింది. ఇక ప్రస్తుతం బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.
Read also: ఆ నలుగురు హీరోయిన్లు మెగాస్టార్ తో నటించడానికి ఒప్పుకోలేదు..కారణం..!!