Advertisement
సూపర్ స్టార్ కృష్ణ మరణం తెలుగు ప్రేక్షకులను కలచివేస్తోంది. తన నటనతో ఎన్నో చిత్రాలలో నటించి ప్రేక్షకులను అలరించారు. తన నటనతో పాటు, తన వ్యక్తిత్వంతో ధైర్యంతో ఎంతో మంది అభిమానం సంపాదించుకున్నారు. ఎన్టీఆర్, నాగేశ్వరరావు హీరోలుగా ఫుల్ జోష్ లో ఉన్న కాలంలో జూనియర్ గా కృష్ణ తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టారు. కృష్ణ భారీ ఫ్యాన్ బేస్ ఉన్న కథానాయకుడు. 1965 లో తేనె మనసులుతో హీరోగా అడుగుపెట్టి, మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నారు. అయినప్పటికీ కెరీర్ మొదట్లో కుల గోత్రాలు, పదండి ముందుకు, పరువు ప్రతిష్ట వంటి సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేశారు.
Advertisement
కౌబాయ్ జోనర్ ని తెలుగు స్క్రీన్ కి పరిచయం చేసిన హీరో కృష్ణ అప్పట్లోనే పాన్ ఇండియా సినిమాగా పలు భాషల్లో మోసగాళ్లకు మోసగాడు సినిమాను రిలీజ్ చేశారు. అన్ని భాషల్లోనూ ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. గూడచారి 116, జేమ్స్ బాండ్ 777, ఏజెంట్ గోపి, రహస్య గూఢచారి, గూడచారి 117 వంటి స్పై సినిమాల్లోనూ నటించి సూపర్ హిట్ అందుకున్నారు. నటుడు మాత్రమే కాదు, అభిరుచి గల నిర్మాత, దర్శకుడు కూడా, 17 చిత్రాలకు దర్శకత్వం వహించిన కృష్ణ, సొంతంగా పద్మాలయ స్టూడియోస్ ప్రొడక్షన్ కంపెనీని స్థాపించి అనేక సినిమాలను నిర్మించారు. సాంకేతికంగా ఎప్పుడు ముందుండాలనుకునే కృష్ణ తన సినిమాలతో తెలుగు వెండితెరపై అనేక ప్రయోగాలను చేశారు.
Advertisement
సూపర్‌స్టార్ కృష్ణ తెలుగు సినిమాకి పరిచయం చేసిన సినిమాలు ఇవే
తొలి సినిమా స్కోప్ సినిమా-అల్లూరి సీతారామరాజు
తొలి సినిమా స్కోప్ సాంఘిక సినిమా-దేవదాసు
తొలి సినిమా స్కోప్ పౌరాణిక సినిమా-కురుక్షేత్రం
తొలి సినిమా స్కోప్ జేమ్స్ బాండ్ మూవీ-ఏజెంట్ గోపి
తొలి సినిమా స్కోప్ కౌబాయ్ సినిమా దొంగల దోపిడి, పూర్తిస్థాయిలో మోసగాళ్లకు మోసగాడు
తొలి ఈస్ట్ మాన్ కలర్ సినిమా-ఈనాడు
తొలి 70 ఎం ఎం సినిమా-సింహాసనం
తొలి డిటిఎస్ సినిమా-తెలుగు వీర లేవరా
READ ALSO : ఓడిపోతామని రోహిత్ శర్మకు ముందే తెలుసా.. ఫ్రూఫ్ ఇదిగో!