Advertisement
నవమాసాలు మోసి కనీ అలనా పాలనా చూసిన తల్లి తాను చనిపోతే.. తల గొరివి పెడతాడు అనుకుంటుంది. కానీ కని పెంచిన చేతులతో కొరివి పెట్టాల్సిన పరిస్థితి వస్తే నా తల్లికి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఆమె బాధ వర్ణనాతీతం అనే చెప్పాలి. అలాంటి హృదయవిదారక ఘటన ఒకటి వెలుగు చూసింది. వయస్సు అయిన తల్లి తన కొడుకుకు తలకొరివి పెట్టిన ఘటన అందరిని కలిచివేసింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసింది. కన్న కొడుకుకు తల్లి తలకొరివి పెట్టిన హృదయవిధారక ఘటన కృష్ణాజిల్లాలో చోటుచేసుకుంది. అనారోగ్యంతో కొడుకు చనిపోగా వృద్ధురాలు అయినా ఆ తల్లి కన్నీటిని దిగమింగుకుంటూ అన్ని తానయి అంత్యక్రియలు నిర్వహించింది.
Advertisement
Advertisement
ఈ హృదయవిదారక ఘటన కృష్ణాజిల్లా మోపిదేవి మండలం మెరకనపల్లి గ్రామానికి చెందిన పామర్తి ప్రసాద్ కు ఇద్దరూ ఆడపిల్లలు సంతానం. ఇటీవల అతడు తీవ్ర అనారోగ్యానికి గురవడంతో బ్రతికించుకోవడానికి ఆ కుటుంబం లక్షలు ఖర్చు చేసుకొని హాస్పిటల్స్ కు తిప్పారు. అయినా ఫలితం లేకుండా అతడు మరణించాడు. అయితే అతడికి కొడుకులు లేకపోవడంతో కన్నతల్లే తలకొరివి పెట్టింది.తన చేత్తో అన్నం కలిపి పెట్టిన తల్లికి తలకొరివి పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని అక్కడున్న వారంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక ఆ తల్లి కొడుకు మృతదేహం వద్ద వృద్ధురాలు పామర్తి ఝాన్సీ కంటతడి పెట్టడం అందరిని కలచివేసింది. తనకు తలకొరివి పెట్టాల్సిన వాడికి తానే తలకొరివి పెట్టాల్సి వస్తోందంటూ ఆ తల్లి కన్నీరు పెట్టుకుంది. అన్నీ తానే అయి కొడుకు అంత్యక్రియలు నిర్వహించి ఆ తల్లి తలకొరివి పెట్టింది. బంధువులు, గ్రామస్తులు ఎంత ఓదార్చిన ఈ వయసులో కొడుకును కోల్పోయిన ఆ తల్లి బాధ ఇప్పట్లో తగ్గేది కాదు. ఆమెకు ఆ దేవుడు ధైర్యం ఇవ్వాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.