Advertisement
సాధారణంగా ఈ మధ్యకాలంలో అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువ అవుతున్నాయి. కరోనా మహమ్మారి నుంచి మరీ ఎక్కువగా పెరిగిపోతున్నాయి. ఇక అందులో గుండెపోటు సమస్యతో బాధపడే వారు కూడా ఎక్కువగానే ఉన్నారు. వారిలో కొంతమంది అకస్మాత్తుగా మరణిస్తున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటుకు గురవుతున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఈ మధ్యకాలంలో ఈ సమస్య చాలా తీవ్రతరం అవుతోంది.
Advertisement
Advertisement
తాజాగా రక్షాబంధన్ రోజు ఓ వ్యక్తికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అయితే ఆ ఇంటి ఆడపడుచు తన అన్నకు రాఖీ కట్టేందుకు వచ్చింది. దీంతో పుట్టెడు దుఃఖం మిగిలింది. పెద్దపెల్లి జిల్లా ఎలిగేడు మండలం దునికట్టకు చెందిన చౌదరి కనకయ్యకు రాఖీ కట్టేందుకు చెల్లి ఇంటికి వచ్చింది అప్పటివరకు చెల్లితో సంతోషంగా గా కనకయ్య ఒక్కసారిగా కుప్పకూలి మరణించాడు. అన్న తిరిగిరాని లోకాలకు వెళ్లినప్పటికీ తన సోదరి గౌరమ్మ రాఖీ కట్టి తన ప్రేమను చాటుకుంది. ఇద్దరు మధ్య ఉన్న అనురాగాన్ని చూసిన వారందరూ కన్నీటి పర్వంతం అవుతున్నారు. ఎందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.