Advertisement
రామ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం “ది వారియర్” ఈనెల 14వ తేదీన భారీ అంచనాల మధ్య థియేటర్ లోకి వచ్చింది. తమిళ దర్శకుడు లింగుస్వామి తెలుగు, తమిళంలో తెరకెక్కించారు. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు ఎనిమిదిన్నర కోట్ల కలెక్షన్స్ సాధించింది. దీంతో మిశ్రమ స్పందన ఎదురైంది. అయితే ఈ సినిమాపై తాజాగా హీరో రామ్ స్పందించారు. ఇంతటి కఠిన సమయంలో కూడా థియేటర్స్ లోకి ఆడియన్స్ రావడం గొప్ప విషయమని అన్నారు.
Advertisement
మొదట కరోణ తర్వాత వర్షం రిలీజ్ ముందు వరకు ఏదో ఒక అడ్డంకి వస్తుందని, సినిమాను విడుదల చేయాలా వద్దా అని ఆలోచించారట. ఎన్నో అంచనాల మధ్య చివరికి సినిమా రిలీజ్ చేశారు. కానీ మూవీ విడుదలై 6 రోజులైనా దాదాపు 30 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా బడ్జెట్ మరియు కాస్టింగ్ ఇతర పెట్టుబడుల కారణంగా ఈ మూవీ భారీ డిజాస్టర్ గా నిలిచే అవకాశం ఉంది. ఓవర్సీస్ లో ఈ మూవీ కూడా భారీ పరాజయాన్ని చవిచూసినట్టు సమాచారం. అయితే ఈ సినిమాతో రామ్ పోతినేని తమిళ ఇండస్ట్రీలో అరంగేట్రం చేశాడు. ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్ గా నటించారు. ఈ మూవీని తమిళ్ లో లింగుస్వామి ఒక స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా నిర్మించారు.
Advertisement
రామ్ పోతినేని మరియు కృతి శెట్టి అద్భుత యాక్టింగ్ ఉన్నా కానీ ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదని టాక్. ఓవరాల్ గా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా నష్టపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ మూవీని ముందు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో చేయాలనుకున్నారట. కానీ ఆయనకు కథ నచ్చకపోవడంతో రిజెక్ట్ అయిందట. ప్రస్తుతం సినిమా డిజాస్టర్ గా నిలుస్తుందనే టాక్ రావడంతో అల్లు అర్జున్ పై కొంతమంది నెటిజెన్స్ ఈ సినిమాను అల్లుఅర్జున్ రిజెక్ట్ చేసి డిజాస్టర్ నుంచి తప్పించుకున్నారని, లేదంటే ఆయన ఖాతాలో ఈ డిజాస్టర్ పడేదని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
ALSO READ:
క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేసి స్టార్ హీరో, హీరోయిన్లుగా మారిన 10మంది నటీనటులు ఎవరంటే..?