Advertisement
ఏపీ రాజకీయాలు సినీ ఇండస్ట్రీలో ఎక్కువ వినిపిస్తున్న పేరు పవన్ కళ్యాణ్. అసెంబ్లీ ఎన్నికలు విడుదలైన తర్వాత ఆ పవన్ కళ్యాణ్ పేరు రేంజ్ లో వినపడుతోంది. ఇదిలా ఉంటే సినిమా అనేది ఎంత శక్తివంతమైందో పవన్ కళ్యాణ్ ద్వారా మరోసారి ప్రపంచానికి తెలిసి వచ్చింది. ఉపముఖ్యమంత్రి అవ్వడానికి మంత్రి అవ్వడానికి సినిమాయే కారణం పవన్ కి కూడా ఈ విషయం తెలుసు. అయితే అంతకంటే ముఖ్యంగా కోట్లాది మంది ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచేలా చేసింది సినిమాయే అనడంలో సందేహం లేదు. పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు చాలా ఏళ్ళ క్రితమే షూటింగ్ స్టార్ట్ అయింది.
Advertisement
అనుకోని కారణాల వలన పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. తర్వాత స్టార్ట్ అయిన ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు తో పోల్చుకుంటే కొంచెం స్పీడ్ గానే షూటింగ్ పూర్తవుతుంది. పైగా వీరమల్లు గురించి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో సినిమా ఆగిపోతుందని పుకార్లు కూడా వచ్చాయి దీంతో ప్రొడ్యూసర్ ఏం రత్నం రంగంలోకి దిగారు. 50% సినిమా షూటింగ్ పూర్తి అయిపోయిందని చెప్పారు. పైగా చిన్నపాటి టీజర్ కూడా రిలీజ్ చేశారు. టీజర్ ఒక రేంజ్ లో ఉండడంతో ఫాన్స్ ఆనందానికి అవధులు లేవు. ఇప్పుడు ఇంకో న్యూస్ వాళ్ళ ఆనందానికి రెస్ట్ లేకుండా చేస్తోంది. అదేంటంటే జూన్ చివరివారం నుండి జూలై మొదటి వారం నుండి పవన్ వీరమల్లు షూటింగ్ ప్రారంభమవుతుందని.
Advertisement
Also read:
పవన్ ఎన్నికల్లో గెలిచే కొన్ని రోజులు కూడా అవ్వలేదు పైగా మినిస్టర్ అండ్ డిప్యూటీ మినిస్టర్‌గా ఇంకా కుదురుకోలేదు. అలాంటిది సినిమాలు ఎలా చేస్తారు అనే ప్రశ్న కూడా అందరిలో వస్తోంది. కొంచెం ఆలస్యమైనా సినిమాలకు డేట్స్ కేటాయిస్తాడని అంతా అంటున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సినిమాల్లో రెండిట్లో కూడా రాణించాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా ఉండగానే శ్రీనాధ కవి సార్వభౌముడు షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొన్నారు. మళ్ళీ అలా పవనే.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!