Advertisement
సెమీస్ పోరులో టీమిండియాకు నిరాశ మిగిలింది. 15 ఏళ్ల నిరీక్షణకు తెరందించేందుకు, ఎన్నో కలలతో ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన టీం ఇండియా, సెమీస్ లో పోరాటం ముగించి తిరుగు పయనం అయింది. ఆస్ట్రేలియా వేదికగా టి 20 వరల్డ్ కప్ 2022లో సూపర్ 12లో ఐదు మ్యాచ్ ల్లో నాలుగు విజయాలతో గ్రూప్ బి టాపర్ గా సెమీస్ చేరిన భారత్, ఆడిలైడ్ వేదికగా గురువారం ఇంగ్లాండ్ తో జరిగిన సెమీస్ లో పరాజయం పాలైంది. అయితే ఊహించని విధంగా ఘోర ఓటమిని చవిచూసిన ఇండియాకు ఏ ఏ కారణాలు దోహదపడ్డాయి అన్నది ఇప్పుడు చూద్దాం.
Advertisement
టాస్ ఓడిపోవడం:
టాస్ విషయంలో మన ప్రమేయం ఉన్నా లేకపోయినా ఈ మ్యాచ్ ఓడిపోవడానికి మాత్రం ప్రధాన కారణం అని చెప్పాలి. కీలకమైన సెమీ ఫైనల్ మ్యాచ్ లో పిచ్ స్వభావం ఏ విధంగా ఉన్నా చేజింగ్ అయితే మనకు ఉన్న బ్యాటింగ్ డెప్త్ కు చూసుకుంటూ ఆడితే విజయం దక్కే అవకాశాలు ఉండేవి. కానీ టాస్ ఓడిపోవడం ఇంగ్లాండుకు ప్లస్ అయింది.
Advertisement
రోహిత్ సేన బ్యాటింగ్ లో వైఫల్యం:
ఈ టోర్నీలో గెలిచిన మ్యాచ్ లలో ఎక్కువ భాగం కోహ్లీ మరియు సూర్య కుమార్ యాదవ్ రాణించడం వలనే, కానీ మిగిలిన వారు అంటే కెప్టెన్ రోహిత్ శర్మ, రాహుల్, హార్దిక్ పాండ్యాలు దాదాపుగా అంచనాలకు తగినట్లు మాత్రం రాణించడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ నెదర్లాండ్ తో మ్యాచ్ లో మినహా పరుగులు చేయడంలో తడబడుతూనే ఉన్నాడు. ఆఖరికి ఎంతో కీలకమైన ఈ మ్యాచ్ లో కూడా రోహిత్ శర్మ టచ్ లోకి వచ్చినట్లే కనిపించిన అనవసర షార్ట్ ఆడి అవుట్ అయ్యాడు. ఇక రాహుల్ కూడా రెండవ ఓవర్ లోనే అవుట్ అయ్యి తాను ఇంకా ఫామ్ లో లేడని చాటి చెప్పాడు. సూర్య కుమార్ యాదవ్ కూడా అన్ని మ్యాచ్ లలో ఆడి సెమీఫైనల్ మ్యాచ్ లోనే అవుట్ అయ్యాడు.
బౌలర్ల దారుణ వైఫల్యం:
169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండును ఇండియా బౌలర్లు ఏ దశలోను వికెట్ తీయడం కాదు కదా కనీసం ఇబ్బంది పెట్టలేకపోయారు. నిన్నటి వరకు గుడ్ బౌలింగ్ అటాక్ అంటూ చెప్పుకున్న భూవి, అర్ష్ దీప్ మరియు షమీలు పూర్తిగా తేలిపోయారు.
read also : ఎన్టీఆర్ తల్లికి, నాగశౌర్య కాబోయే భార్యకు రిలేషన్ ఏంటో తెలుసా ?