Advertisement
అప్పటి రోజుల్లో ఓ చిత్రం హిట్ అయిందంటే ఎన్ని రోజులు ఆడింది అనేది రికార్డ్స్ గా చెప్పుకునేవారు. 100 రోజులు, 175 రోజులు, 200 రోజులు, 360 రోజులు ఇలా చెప్పుకునే వారు. టీవీలు లేని రోజులు కాబట్టి అప్పట్లో చిత్రాలు ఎక్కువ రోజులు ప్రదర్శితం అయ్యేవి. కొంచెం ట్రెండు మారిన తర్వాత ఎన్ని రోజులు, ఎన్ని సెంటర్స్ లో ఆడింది అనేది చర్చించుకోవడం మొదలు పెట్టేవారు.
Advertisement
ఇక టాలీవుడ్ లోనే కాకుండా అన్ని భాషల్లో కూడా రీమేక్ ల ట్రెండ్ నడుస్తోంది. సూపర్ హిట్ కాకున్నా మినిమం గ్యారంటీ అన్నట్లుగా ఉంటాయి అనే ఉద్దేశంతో రీమేక్ లు చేస్తున్నారు. ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు రీమేక్ లు చేశారు. కొన్ని సినిమాలు మాత్రం ఒరిజినల్ వెర్షన్ ను డామినేట్ చేసే విధంగా సూపర్ హిట్ అయ్యాయి. ఒరిజినల్ వేర్షన్ కంటే బిగ్గెస్ట్ సక్సెస్ ను దక్కించుకున్న 5 రీమేక్ సినిమాలను ఇప్పుడు చూద్దాం.
Also Read: సర్కార్ వారి పాటలో ఈ మిస్టేక్ ను గమనించారా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అబ్బా!
#1
అమితాబచ్చన్ హిట్ మూవీ పింక్ కు రీమేక్ గా వచ్చిందే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్. మెసేజ్ ఓరియంటెడ్ మూవీగా పింక్ వచ్చింది. వసూళ్లు చాలా నార్మల్ గా వచ్చాయి. కానీ పింక్ కు రీమేక్ గా వచ్చిన వకీల్ సాబ్ భారీగా వసూళ్లను నమోదు చేసింది.
Advertisement
#2
హిందీ దబాంగ్ సినిమాను పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ గా రీమేక్ చేశాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన గబ్బర్ సింగ్ భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసింది.
#3
చిరంజీవి చేసిన హిట్లర్ మలయాళం హిట్ చిత్రం హిట్లర్ కు రీమేక్ ముమ్ముట్టి చేసిన హిట్లర్ కంటే తెలుగులో చిరంజీవి చేసిన హిట్లర్ సినిమా మూడు నాలుగు రెట్ల అధిక శాతం వసూళ్లను దక్కించుకుంది.
#4
తమిళ్ మూవీ రమణకు రీమేక్ గా ఠాగూర్ ను చిరు చేశారు. వినాయక దర్శకత్వంలో రూపొందిన ఠాగూర్ సినిమా ఒరిజినల్ వెర్షన్ కంటే బాగుందనే టాక్ దక్కించుకుంది. అంతేకాకుండా వసూళ్లు కూడా భారీగా నమోదయ్యాయి.
#5
బాలీవుడ్ లో వచ్చిన మున్నాభాయ్ ఎంబిబిఎస్ ను తెలుగులో చిరంజీవి శంకర్ దాదా ఎంబిబిఎస్ గా రీమేక్ చేశారు. తెలుగులో చిరంజీవి చేసిన సినిమాకు మంచి వచ్చింది. మున్నాభాయ్ కంటే ఎక్కువ వసూలు నమోదు అయ్యాయి.
Read Also : ఉదయ్ కిరణ్ తో మల్టీస్టారర్ మూవీ..నో చెప్పిన తరుణ్.. ఆ సినిమా ఏంటంటే..?