Advertisement
భారతదేశంలో అత్యంత ప్రజాధారణ పొందిన క్రికెటర్లలో శిఖర్ ధావన్ ఒకరు. చాలా మంది అతని బ్యాటింగ్ ఎంతో ఇష్టపడుతారు. అతని వ్యక్తి గత విషయాల గురించి చాలా మందికి తెలియదు. ఈ క్రికెటర్ తాజాగా విడాకులు తీసుకున్నారు. పెళ్లి జరిగిన తరువాత విడాకులు తీసుకున్నటువంటి క్రికెటర్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
విడాకులు తీసుకున్న 6 మంది భారతీయ క్రికెటర్లు వీరే..!
దినేష్ కార్తిక్ :
2007లో అప్పటికీ.. 21 ఏళ్ల వయస్సు ఉన్న దినేష్ కార్తిక్ తన చిన్ననాటి స్నేహితురాలు నికితా వంజరను పెళ్లి చేసుకున్నాడు. 2012లో క్రికెట్ మ్యాచ్ సందర్భంలో విజయ్ తో నికితకి రిలేషన్ ఉన్నట్టు కనుగొన్నాడు. నికితా-మురళి విజయ్ వ్యవహారం గురించి తెలుసుకున్న కొద్ది కాలానికే దినేష్ విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. 2012లోనే విడాకులు తీసుకున్నారు. అప్పట్లో వారి విడాకులు చాలా చర్చనీయాంశంగా మారాయి. ఆ తరువాత ప్రముఖ క్రీడాకారిణి దీపికా పల్లికల్ ను పెళ్లి చేసుకున్నాడు.
ఇవి కూడా చదవండి: హైదరాబాద్ లో బస చేస్తున్న పాక్ టీం కి ఫుడ్ మెనూ ఏంటో తెలుసా ? ఫుడ్ మెనూ లో అది లేకపోవడం చూసి షాక్ అయిన పాక్ఆటగాళ్లు !
వినోద్ కాంబ్లీ :
మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్లలో భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ కూడా ఒకరు. 1998లో చిన్నప్పటి స్నేహితురాలు నోయెలలా లూయిస్ ను పెళ్లి చేసుకున్నాడు. వినోద్ 2005లో ఆమెకు విడాకులిచ్చాడు. ఆ తరువాత ఆండ్రియా హెవిట్ అనే మాజీ మోడల్ ని పెళ్లి చేసుకున్నాడు. ఆసక్తికర విషయం ఏంటంటే.. కోర్టు వివాహం ద్వారా వారి సంబంధాన్ని అధికారికం చేసుకున్నారు. కొంత కాలం తరువాత భార్య ఆండ్రియా తాగి వచ్చి భర్త తలపై కొట్టినందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో వార్తల్లో నిలిచింది.
ఇవి కూడా చదవండి: మ్యాచ్ ఆడుతున్నప్పుడు టాయిలెట్ కి వెళ్లాల్సి వస్తే, క్రికెటర్స్ ఏమి చేస్తారు?
యోగరాజ్ సింగ్ :
Advertisement
చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చు యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ కూడా అతని కాలంలో ప్రసిద్ధ క్రికెటర్. అయితే, గాయం కారణంగా అతని కెరీర్ అతను ఊహించిన దాని కంటే త్వరగా ముగిసింది. విడాకులు తీసుకున్న క్రికెటర్ల జాబితాలో కూడా ఆయన చోటు దక్కించుకున్నాడు. సత్వీర్ కౌర్‌ను వివాహం చేసుకోవడానికి యోగరాజ్ సింగ్ తన మొదటి భార్య షబ్మాన్ సింగ్‌కు విడాకులు ఇచ్చాడు. షబ్మాన్ సింగ్ మరెవరో కాదు యువరాజ్ సింగ్ తల్లి.
మహ్మద్ అజారుద్దీన్ :
ప్రస్తుతం భారతీయ రాజకీయ నాయకుడు. మొహమ్మద్ అజారుద్దీన్ ఒకప్పుడు ప్రముఖ భారతీయ క్రికెటర్, కెప్టెన్ కూడా. తిరిగి 1996లో ప్రముఖ నటి సంగీత బిజ్లానిని పెళ్లి చేసుకోవడానికి అతను తన మొదటి భార్య నౌరీన్ కి విడాకులిచ్చాడు. అతని రెండో పెళ్లి సుమారు 14 సంవత్సరాల పాటు కొనసాగింది. తరువాత అతను సంగీత నుంచి కూడా విడాకులు తీసుకున్నాడు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తాతో అజర్ కి ఉన్న అనుబంధం కారణంగానే రెండో విడాకులు తీసుకున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. అవి పుకార్లు తప్ప మరేమీ కాదని.. క్రికెటర్ కొట్టి పారేశాడు.
ఇవి కూడా చదవండి: పెట్రోల్ కోసం ₹30 అడగడం నుంచి..₹4 లక్షలను విరాళంగా ఇవ్వడం వరకు మొహమ్మద్ సిరాజ్ ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసారో తెలుసా?
శ్రీనాథ్ :
ప్రస్తుతం ఐసీసీ మ్యాచ్ రిఫరీ.. జవగల్ శ్రీనాథ్ ఒకప్పుడు భారత పేసర్. 1999లో జ్యోత్స్నను పెళ్లి చేసుకున్నాడు శ్రీనాథ్. 2007లో ఈ జంట విడాకులు తీసుకుంది. విడాకులు తీసుకున్న తరువాత శ్రీనాథ్ కేవలం ఏడాది వ్యవధిలోనే మాధవి పాత్రావళి అనే జర్నలిస్ట్ ను పెళ్లి చేసుకున్నాడు.
శిఖర్ ధావన్ :
శిఖర్ ధావన్ 2009లో మెల్ బోర్న్ కి చెందిన ఏషా ముఖర్జీతో నిశ్చితార్థం జరిగింది. 2012లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. షికార్ తో వివాహానికి ముందు ఏషా ఆస్ట్రేలియాకు చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నాడు. అయినప్పటికీ ఆమె తన పెళ్లిని కొనసాగించడంలో విఫలం చెందింది. అక్టోబర్ 05, 2023న శిఖర్ ధావన్ దంపతులు విడాకులు తీసుకున్నారు. వీరికి జోరావర్ ధావన్ అనే కుమారుడు కూడా ఉన్నాడు.