Advertisement
నందమూరి తారకరామారావు గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. అటు రాజకీయాల్లో, ఇటు సినిమాల్లో రెండింటిలో రాణించిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్. 1932లో మొట్టమొదటి తెలుగు చలన చిత్రం భక్త ప్రహ్లద విడుదలైన రోజు అతనికి సుమారు ఎనిమిదేళ్ల వయస్సు ఉంటుంది. తన తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు. తను పరిపాలించడానికి ఓ రంగం సిద్ధమవుతున్న సంగతి కడూా అతనికి తెలియదు. కాలంతో పెరిగెడుతూ పిల్లవాడు యువకుడు అయ్యాడు. కళాశాల చదువు, నాటకాలు, ఓ వైపు కుటుంబానికి ఆసరాగా సైకిల్ మీద తిరుగుతూ ఇంటింటికీ పాలుపొయ్యడం మరోవైపు. ఈ మధ్యలోనే ఓ చిన్న పోలీస్ ఇన్ స్పెక్టర్ పాత్ర ద్వారా సినిమా రంగంలోకి ప్రవేశపెట్టింది. అక్కడి నుంచి అతని అడుగులు వేసుకుంటూ తెలుగు ప్రజల గుండెల వైపు పడ్డాయి. తెలుగు వారి కృష్టుడిగా, దేవుడిగా ఎన్టీఆర్ విశ్వవిఖ్యాతుడయ్యాడు. ఇవాళ మహానటుడి శతజయంతి.
Advertisement
ఎన్టీఆర్ మహానటుడు.. ఎవరు కాదనరు. అలాంటి నటుడు ఎంచుకునే పాత్రలు ఏ స్థాయిలో ఉంటాయి. ప్రేక్షకుల్లో ఉన్న అభిమానానికి ఇంకా చెప్పాలంటే వారు ఇచ్చిన ఇమేజ్ కి అనుగుణంగా ఉండాలి కదా.. కానీ ఎన్టీఆర్ మాత్రమే పాత్రకు తగినట్టుగా ఇమేజ్ ని పక్కకు పెట్టారు. దేవుడిగా చేసిన ఆయన విలన్ గా చేసి మెప్పించారు.
నందమూరి తారకరామారావు పేరు తలుచుకోగానే నిండైన విగ్రహం కనిపిస్తుంది. అఖిలాంధ్ర ప్రేక్షకుల చేతు చంద్రహారం వేయించుకున్న నటుడు ఎన్టీఆర్. ఎన్నో తరాలను ప్రభావితం చేసిన నటుడిగా సమ్మోహన శక్తిగా తెలుగుతెర భాష ఉన్నంత కాలం ఉంటాడు. ఎన్టీఆర్ కి సంబంధించిన ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని ఫొటోలు నెటిజన్లు చూసి పలు కామెంట్స్ చేస్తున్నారు.
Advertisement