Advertisement
క్రికెట్ లో మూడు ఫార్మర్స్ ఉంటాయి. టెస్ట్ క్రికెట్, టి-20, వన్డే ఫార్మాట్ ఇలా మూడు ఫార్మర్స్ ఉంటాయి. ఇక టెస్ట్ క్రికెట్ అంటే ఆటగాళ్ల సహనం, ప్రతిభకు ఒక సవాల్ లాంటిది. టెస్ట్ క్రికెట్ లో వారి బలం ఏమిటో తెలుసుకునే అవకాశం వస్తుంది. ఇక పొట్టి ఫార్మాట్లలో బ్యాటర్స్ విధ్వంసంగా ఆడుతూ ఉంటారు. మొదటి బంతి నుంచే బౌండరీల ద్వారా భారీ స్కోర్స్ సాధించాలని భావిస్తూ ఉంటారు. ప్రతి బంతిని సిక్స్ కొట్టి తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయాలని అభిమానులు కూడా అనుకుంటారు. అయితే అలా వన్డే క్రికెట్ లో అత్యధిక సిక్స్ లు కొట్టిన ఆటగాళ్లు ఎవరు అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..
Advertisement
1) యువరాజ్ సింగ్ ( ఇండియా)
304 వన్డే మ్యాచ్ లలో 155 సిక్స్ లు నమోదు చేశాడు.
2) రికీ పాంటింగ్ ( ఆస్ట్రేలియా)
375 వన్డే మ్యాచ్ లలో 162 సిక్స్ లు నమోదు చేశాడు.
3) మార్టిన్ గప్టిల్ ( న్యూజిలాండ్)
Also Read: ఐపీఎల్ 2023లో కొత్త రూల్..ఇక ఆటగాళ్లకు పండగే !
Advertisement
198 వన్డే మ్యాచ్ లలో 187 సిక్స్ లు నమోదు చేశాడు.
4) సౌరవ్ గంగూలీ ( ఇండియా)
311 వన్డే మ్యాచ్ లలో 190 సిక్స్ లు నమోదు చేశాడు.
5) సచిన్ టెండూల్కర్ ( ఇండియా)
463 వన్డే మ్యాచ్ లలో 195 సిక్స్ లు నమోదు చేశాడు.
6) బ్రెండన్ మెకల్లమ్ ( న్యూజిలాండ్)
260 వన్డే మ్యాచ్ లలో 200 లు నమోదు చేశాడు.
7) ఏబి డివిలియర్స్ ( సౌత్ ఆఫ్రికా)
228 వన్డే మ్యాచ్ లలో 204 సిక్స్ లు నమోదు చేశాడు.
8) ఇయాన్ మోర్గాన్ ( ఇంగ్లాండ్)
248 వన్డే మ్యాచ్ లలో 220 సిక్స్ లు నమోదు చేశాడు.
9) ఎమ్మెస్ ధోని ( ఇండియా)
350 వన్డే మ్యాచ్ లలో 229 సిక్స్ లు నమోదు చేశాడు.
10) రోహిత్ శర్మ ( ఇండియా)
233 వన్డే మ్యాచ్ లలో 250 సిక్స్ లు నమోదు చేశాడు.
11) సనత్ జయసూర్య ( శ్రీలంక)
445 వన్డే మ్యాచ్ లలో 270 సిక్స్ లు నమోదు చేశాడు.
Also Read: MS ధోనినా మజకా..మిస్టర్ కూల్ చాణక్యంతో వరల్డ్ కప్ హీరో అయ్యాడు!