Advertisement
ఏపీ రాజకీయాల్లో అనేక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తర్వాత చాలా మార్పులు వచ్చాయి. గత ఏడాది టిడిపి ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణలో ట్విస్టులు మొదలయ్యాయి. సిఐడి సెక్షన్ 17 ఏ ప్రకారం నిబంధనలు పాటించలేదన్న విషయంపై సాంకేతిక కారణాన్ని తెరపైకే చంద్రబాబు ప్రభుత్వం తీసుకురాగా.. మరో అంశంలో షాక్ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. నిన్న జరిగిన సుప్రీంకోర్టు విచారణలో స్కిల్ కేసు దర్యాప్తు ప్రారంభమైంది.
Advertisement
వీటిని కూడా చదవండి: భువనేశ్వరి, బ్రాహ్మణి కూడా జైలుకు వెళ్తారా..? కేసు ప్రూవ్ అయితే…?
సుప్రీంకోర్టు ధర్మాసనంలో న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ఉన్న ఆధారాలని బట్టి రెండు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. చంద్రబాబుపై దాఖలు చూసిన ఎఫ్ఐఆర్ 2018 లో పార్లమెంట్ తెచ్చిన సెక్షన్ 17 ఏ కంటే ముందా తర్వాత అన్నది ఒకటి. ఇంకొకటి వచ్చేసి సెక్షన్ 17 ఏ కేవలం అవినీతి నిరోధక చట్టం కింద నమోదు చేసిన కేసులకే వర్తిస్తుందా లేదంటే ఐపిసి సెక్షన్ల కింద నమోదు అయిన సెక్షన్లకి కూడా వర్తిస్తుందా..? అనేది ఇంకొక అంశం.
వీటిని కూడా చదవండి: లోకేష్ ఢిల్లీ లో ఏం చేస్తున్నారు..? సిఐడి అధికారులు పంపిన నోటీసులు.. అరెస్ట్ చేస్తారా..?
Advertisement
స్కిల్ కేసులో సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ 2018 జూలై 18న పార్లమెంట్ సెక్షన్ 17 ఏ తీసుకురావడానికి అంటే ముందా ముందు చేశారా లేదంటే తర్వాత అని ధర్మాసనం ప్రశ్నించగా.. చంద్రబాబు ఎఫ్ఐఆర్ గురించి ప్రస్తావించని సిఐడి న్యాయవతి స్కిల్ కేసు దర్యాప్తు మాత్రం చంద్రబాబు హయాంలోనే 2016 లో మొదలైంది అని చెప్పారు.
హైకోర్టుకి కూడా ఇవే ఆధారాలు ఇచ్చారని అడిగితే అవునని అన్నారు. వాటిని సమర్పించమని కోర్టు చెప్పింది. సెక్షన్ 17 ఏ అవినీతి నిరోధక చట్టం ప్రకారం నమోదు అయిన కేసుకి వర్తిస్తుందా లేదంటే ఐపిసి సెక్షన్లకు కూడా వర్తిస్తుందా అనే క్వశ్చన్ ధర్మసనానికి ఎదురయింది. ఎఫ్ ఐ ఆర్ అవినీతి నిరోధక చట్టం ప్రకారమే పెట్టారని ఏసీబీ కోర్టు రిమాండ్ విధించినట్లు లాయర్లు చెప్పారు. ఐపిసి సెక్షన్ కూడా సెక్షన్ 17 ఏ వర్తిస్తుందని అన్నారు. చంద్రబాబుని అవినీతి నిరోధక చట్టం కింద అరెస్ట్ చేసినందున ఇది చల్లదని తీర్పు ఇవ్వాలన్నారు లాయర్లు. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది.
Also read: భువనేశ్వరి, బ్రాహ్మణి కూడా జైలుకు వెళ్తారా..? కేసు ప్రూవ్ అయితే…?