Advertisement
మన హిందూ సంప్రదాయం ప్రకారం మనం ప్రతి ఒక్క వస్తువును పూజిస్తూ ఉంటాం. చెట్టు పుట్ట గాలి వాన నీరు నిప్పు ఇలా దేన్నైనా సరే ఆరాధిస్తూ దేవుడిలా నమ్ముతాం.. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతిరోజు తులసి చెట్టుకు పూజ చేస్తూ తులసిని ఆరాధ్య దైవంగా భావిస్తూ ఉంటాం. అలాంటి తులసి మొక్క గురించి కొన్ని విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలని పండితులు అంటున్నారు..
Advertisement
అవేంటో ఇప్పుడు చూద్దాం.. హిందూ పురాణాల ప్రకారం తులసి మొక్కకు చాలా ప్రాధాన్యం ఉంది. సకల దేవతల స్వరూపంగా కొలుస్తూ ఉంటారు. అలాంటి స్వచ్ఛమైన ఈ తులసి మొక్క వద్ద ఇలాంటి వస్తువులు పెట్టినట్లయితే నష్టాలు తప్పవంటున్నారు పండితులు. అవేంటో ఓ లుక్కేద్దాం.. చాలామంది తులసి మొక్క దగ్గర శివలింగాన్ని పెట్టి పూజిస్తూ ఉంటారు. అలా ఉంచకూడదని పండితులు అంటున్నారు. అంతేకాకుండా తులసి మొక్క వద్ద ఇంట్లో శుభ్రం చేసుకునేటువంటి చీపురును ఉపయోగించి శుభ్రం చేయరాదని, అలా చేస్తే కష్టాలు తప్పవని అంటున్నారు.
Advertisement
తులసిలో లక్ష్మీదేవి ఉందని భావిస్తారు. కాబట్టి తులసి మొక్క చుట్టూ చెత్త ఉంటే లక్ష్మీదేవికి కోపం వస్తుందని అందుకే చెత్త ఉంచరాదని అంటున్నారు. ఇలాంటి జాగ్రత్తలు పాటించకపోతే ఇంట్లో అష్ట దరిద్రాలు చేరి నష్టాల పాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని పండిత నిపుణులు హెచ్చరిస్తున్నారు.
also read: