Advertisement
సినిమా సక్సెస్ఫుల్ అయినప్పుడు దానికి క్రెడిట్ అందరికీ దక్కాలి కానీ హీరో డైరెక్టర్లకు మాత్రమే ఎక్కువగా వెళ్తుంది. ఒకవేళ ఫ్లాప్ అయ్యిందంటే మిగిలిన అంశాల గురించి అందరూ మాట్లాడుకోవడం మొదలు పెడతారు. క్రియేటివ్ డిఫరెన్స్ వలన నిరాశపరిచిన సినిమాలు గురించి ఇప్పుడు చూద్దాం.
Advertisement
బ్రూస్ లీ:
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చింది. శ్రీను వైట్ల రైటర్స్ కోన వెంకట్ గోపి మోహన్ మధ్య వచ్చిన మనస్పర్ధలు సినిమా వచ్చాక మాటలు యుద్ధానికి దిగడం వంటివి జరిగాయి.
బ్రహ్మోత్సవం:
మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 2016 లో ఈ సినిమా వచ్చింది సరైన స్క్రిప్ట్ లేకుండా సెట్స్ పైకి వెళ్ళింది ఈ సినిమా దీంతో సినిమా ఫ్లాప్ అయ్యింది మహేష్ బాబు శ్రీకాంత్ ల మధ్య గ్యాప్ ఏర్పడింది. సినిమా అవుట్ పుట్ కూడా అలాగే వచ్చింది.
ఎన్టీఆర్ కథానాయకుడు:
ఎన్టీఆర్ బయోపిక్ ని ముందుగా తేజ దర్శకత్వంలో మొదలుపెట్టారు. బాలయ్య తేజాల మధ్య కనెక్టివిటీ కుదరలేదు దీంతో అతనిని తప్పించి క్రిష్ జాగర్లమూడితో ఈ ప్రాజెక్టుని ముందుకు తీసుకువెళ్లారు. సరైన కాంప్లెక్స్ ఎలిమెంట్స్ లేకపోవడం వలన డిజాస్టర్ గా మిగిలిపోయింది.
కల్కి:
రాజశేఖర్ కి ప్రశాంత్ వర్మ కి వచ్చిన సమస్యలు కారణంగా సినిమా సరిగ్గా రాలేదు బడ్జెట్ పెరిగిపోయి. నిర్మాతని ఇబ్బంది పెట్టడం ఫైనల్ గా సినిమా కూడా ఆశించిన విధంగా రాలేదు.
ఆచార్య:
Advertisement
కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా వచ్చింది ఈ సినిమా కథ విషయంలో జరిగిన వివాదం అందరికీ తెలిసిందే. చరణ్ పాత్ర విషయంలో చిరంజీవి మార్పులు చెప్పడం కొరటాలకే నచ్చలేదు. ప్రతికూల పరిస్థితుల్లో ఈ సినిమాని పూర్తి చేశారు కానీ హిట్ అవలేదు.
ఏజెంట్:
అఖిల్ అక్కినేని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఏజెంట్ డిజాస్టర్ గా నిలిచింది. హీరో డైరెక్టర్ల మధ్య కమ్యూనికేషన్ కుదరకపోవడంతో సినిమా ఫ్లాప్ అయింది.
ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్:
నితిన్ వక్కంతం వంశీ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ అయింది డైరెక్టర్ నిర్మాత హీరో మధ్య సఖ్యత లోపించడం వలన డిజాస్టర్ అయింది.
డెవిల్:
కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ఈ సినిమా విషయంలో డైరెక్టర్ పేరు మార్చడం వంటి కారణాల వలన సినిమా కూడా ఆడలేదు.
Also read:
గుంటూరు కారం:
త్రివిక్రమ్ అనుకున్న కథ ఒకటి తరువాత బయటికి వచ్చిన కథ ఇంకొకటి హీరోయిన్ ని తప్పించడం క్రియేటివ్ డిఫరెన్స్ రావడంతో సినిమా ఆడలేదు.
భారతీయుడు:
భారతీయుడు టు బడ్జెట్ పెరిగిపోయింది శంకర్ పై నిర్మాతలు మండిపడ్డారు ఈ గొడవతో శంకర్ మొదలు పెట్టాడు. శంకర్ పై కేసు వేశారు ఇలాంటి వివాదాలు చోటుచేసుకున్న ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!