Advertisement
మనం ఇష్టపడే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆనందమే వేరు. కానీ అందరికీ అదే సాధ్యం కాదు ఒకసారి ప్రేమలో పడ్డాక దానిని జీవితాంతం అలానే ఉంచాలంటే అది కష్టంతో కూడుకున్నదే. ఈ రోజుల్లో చాలామంది ప్రేమలో పడుతున్నారు. తర్వాత ప్రేమించిన వ్యక్తికి దూరం అయిపోతున్నారు వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నారు. ఇవన్నీ ఈ రోజుల్లో చూస్తున్నాము. ఇది ఇలా ఉంటే ప్రేమ అంటే ఆ ఫీల్ ఏ వేరు. ప్రేమించుకునేటప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు పడే తపన మామూలుగా ఉండదు. ఆ అమ్మాయి కోసం లేదా అబ్బాయి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. కొన్ని కొన్ని సార్లు మనం ఇష్టపడే వ్యక్తి మనల్ని ఇష్టపడుతున్నారా లేదా అనేది తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది.
Advertisement
అబ్బాయిలు కొంచెం ఫాస్ట్ గా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు కానీ అమ్మాయిలు మాత్రం మనసులోనే పెట్టుకుంటారు. అబ్బాయిలు ఇది మీకోసం… అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడుతుందని చెప్పే సంకేతాలు ఇవి. మీరు ఇష్టపడే అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడుతుందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. మరి కొన్ని రోజుల్లో వాలెంటైన్స్ డే వస్తుంది ఈ టైంలో నచ్చిన అమ్మాయికి లేదా అబ్బాయికి ప్రపోజ్ చేస్తే ప్రేమని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లొచ్చు. కొన్ని సంకేతాల ద్వారా ప్రేమని వ్యక్తం చేస్తూ ఉంటారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.. అప్పుడు మీరు ప్రొసీడ్ అయిపోవచ్చు సాధారణంగా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడినట్లైతే ప్రతిసారి ముందు ఆమె మెసేజ్ పెడుతుంది. లేదంటే ఫోన్ చేస్తుంది.
Advertisement
ఆమె మిమ్మల్ని ఇష్టపడుతున్నట్లయితే ప్రతిసారి ఆమె మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది సో ఎప్పుడైనా సరే అమ్మాయిలు మీతో మాట్లాడటానికి మీకు టెక్స్ట్ చేయడానికి ముందు ఉన్నట్లయితే కచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారని మీరు తెలుసుకోవచ్చు. తరచుగా అమ్మాయి మిమ్మల్ని పొగుడుతున్నట్లయితే కూడా ఆమె మిమ్మల్ని ఇష్టపడుతుందని సంకేతం. సో ఎప్పుడైనా మీ మిమ్మల్ని డ్రెస్ బాగుందని లేదంటే మరి ఏ విధమైన కాంప్లిమెంట్స్ వచ్చినా సరే ఆమె మిమ్మల్ని ఇష్టపడుతోంది అని మీరు అర్థం చేసుకోవాలి.
ఐ కాంటాక్ట్ మైంటైన్ చేయడం పాజిటివ్ బాడీ లాంగ్వేజ్ చూపించడం వంటివి చేస్తే కచ్చితంగా ఆమె మిమ్మల్ని ఇష్టపడుతుందని మీరు తెలుసుకోవాలి. అలానే మిమ్మల్ని ఇష్టపడే అమ్మాయి సరదాగా మిమ్మల్ని ముట్టుకోవడం ఇలా చేస్తూ ఉంటుంది మీరు చెప్పే ప్రతి జోక్ కి ఆమె నవ్వుతూ ఉన్నట్లయితే కూడా ఆమె మిమ్మల్ని ఇష్టపడుతుందని మీరు గ్రహించాలి. అలానే ఎక్కువ సమయం మీతో గడపడానికి ఆమె ఇష్టపడుతున్నట్లయితే కూడా మీరు ఆమె మిమ్మల్ని ఇష్ట పడుతోంది అని తెలుసుకోవచ్చు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!