Advertisement
Mahesh Babu and Ntr: ప్రస్తుతం టాలీవుడ్ లో రాణిస్తున్న స్టార్ హీరోల లిస్ట్ తీస్తే అందులో ఎన్టీఆర్ మరియు మహేష్ బాబు కూడా ఉంటారు. ఎన్టీఆర్ ఇప్పటికే పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వగా, మహేష్ బాబు కూడా పాన్ ఇండియా ఎంట్రీ కి రెడీ అవుతున్నాడు. అయితే ఈ ఇద్దరూ జీవితంలోనూ నాలుగు విషయాలు ఒకే రకంగా జరిగాయి అంటూ సోషల్ మీడియాలో కథనాలు దర్శనమిస్తున్నాయి. ఆ నాలుగు విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. జూనియర్ ఎన్టీఆర్ సోదరుడు జానకిరామ్ 2014లో రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే.

Mahesh Babu and Ntr
కాగా, మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు సైతం అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. కాగా ఎన్టీఆర్ సోదరుడు జానకిరామ్ మరణించిన రెండు నెలలకే ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ సైతం రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఇక మహేష్ బాబు ఫ్యామిలీ లోనూ ఇదే విధంగా జరిగింది.
READ ALSO : పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాల్లో నటించమని అడిగితే ఎందుకు శోభన్ బాబు రిజెక్ట్ చేసాడు ?
Advertisement
రమేష్ బాబు మరణించిన కొద్ది కాలానికే మహేష్ బాబు తల్లి కన్నుమూశారు. అంతేకాకుండా హరికృష్ణ చనిపోయిన సమయంలో ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత చేస్తున్నాడు. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించాడు.
ఇక మహేష్ బాబు కూడా ప్రస్తుతం త్రివిక్రమ్ తో ఓ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత జక్కన్న దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక ఈ ఏడాది ఇద్దరి పరిస్థితి ఒకే విధంగా ఉంది. మహేష్ బాబు తండ్రిని కోల్పోయి బాధపడుతుంటే, జూనియర్ ఎన్టీఆర్ తన సోదరుడు తారకరత్న దూరం అవ్వడంతో బాధపడుతున్నాడు. ఇలా నాలుగు విషయాలు కూడా ఇద్దరు జీవితంలో దాదాపు ఒకే విధంగా జరిగాయి.
Advertisement
READ ALSO : Telugu Cinema news, Telugu News