Advertisement
సమాజంలో మనిషి మాట తర్వాత చాలా ఎక్కువ విలువ ఇచ్చేది నమ్మేది కూడా ప్రామిసరీ నోటునే. నగదు బదిలీల విషయంలో ఎక్కువగా ఉపయోగపడేవి ప్రామిసరీ నోట్ లే. ముఖ్యంగా బ్యాంకులు కూడా ఏదైనా అవసరం నిమిత్తం లోన్లు ఇచ్చే ముందు కూడా ప్రామిసరీ నోటు నే ప్రామాణికంగా తీసుకుంటారు. 5000, 10000 తక్కువ అమౌంట్ నుంచి కోటి రూపాయల వరకు ప్రామిసరి నోట్ రాసుకున్న తర్వాతే డబ్బులు అనేవి ఇస్తారు. మరి ఈ ప్రామిసరీ నోటు ఏ విధంగా రాయాలి.. ఎంత అమౌంట్ వరకు ఇది చెల్లుతుంది..
Advertisement
అనేది ఓ సారి చూద్దాం..? చాలామంది ప్రామిసరీ నోటు ఉంటుందనే భరోసాతోనే ఎంత అప్పు అయినా ఇస్తూ ఉంటారు. లక్షల రూపాయలు అప్పులు తీసుకున్న లేదా ఒప్పందాలు చేసుకున్న ప్రామిసరీ నోటు అనేది తప్పనిసరి అయిపోయింది. ఈ నోటు రాసుకుంటే తమకు చెందిన దానిని వేరేవాళ్లు చచ్చిన తీసుకోలేరని నమ్ముతారు. కానీ ఇది రాయడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది.
1. అప్పు ఇచ్చే వాళ్ళకి మరియు తీసుకునే వారికి కచ్చితంగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి. లేదంటే ప్రామిసరీ నోటు చెల్లదు.
Advertisement
2. ఈ నోట్ రాసుకునే సమయంలో అప్పు తీసుకునే వారు మరియు ఇచ్చే వారు తప్పనిసరిగా అక్కడే ఉండాలి.
3. ప్రామిసరీ నోట్ చెల్లె వ్యవధి మూడు సంవత్సరాలు.
4. ఈ నోటు మీద రెవెన్యూ స్టాంప్ అంటించి దానిపై అడ్డంగా మాత్రమే సంతకం చేయాలి.
5. రెవెన్యూ స్టాంప్ మీద మినిమం ఒక రూపాయి అయినా ఉండాలి.
6. ఈ ప్రామిసరీ నోటు పై కోటి రూపాయల వరకు అప్పుగా ఇవ్వవచ్చు.
7. ఇలా ఎక్కువ మొత్తంలో డబ్బు లావాదేవీలు ఉంటే మాత్రం న్యాయవాది తప్పనిసరిగా ఉండాలి.
8. ఫలానా వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకున్నాను. మళ్లీ ఆ వ్యక్తికి ఈ సమయంలోగా నేను డబ్బులు చెల్లిస్తానని తప్పనిసరిగా పాయింట్ రాసుకోవాలి.
9. మతిస్థిమితం లేని వ్యక్తులు ప్రామిసరీ నోటు వ్రాస్తే అది చెల్లదు.
10. ఒకవేళ అప్పులు తీసుకున్న వ్యక్తి డబ్బులు తిరిగి ఇవ్వకపోతే ఆ నోటు ద్వారా మనం కచ్చితంగా డబ్బులు వసూలు చేయవచ్చు.
11. అలాగే నోట్ రాసుకునేటప్పుడు తప్పనిసరిగా ఆ రోజు తేదీని మాత్రం వేసుకోవాలి.
12. ప్రామిసరీ నోటు మీద తేదీ మరియు డబ్బులు వేయకుండా సంతకం చేయడం అనేది నేరం.