Advertisement
చాణక్య ఎన్నో విషయాల గురించి చెప్పారు. చాణక్య చెప్పినట్లు చేస్తే జీవితం చాలా బాగుంటుంది. చాణక్య గొప్ప పండితుడు. వ్యూహకర్త. ఆయన విధానాలు నేటికీ ప్రజలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ఇప్పటికి చాణక్యుడు విధానాలను పాటించే వాళ్ళు ఉన్నారు చాణక్యనితిలో మానవ జీవితానికి సంబంధించి అనేక విషయాలు గురించి ప్రస్తావించారు సంతోషకరమైన జీవితానికి సంబంధించి అనేక రహస్యాలను చెప్పారు. ఈ రకమైన వ్యక్తుల జీవితంలో అస్సలు ఫెయిల్ అవ్వారని చాణక్య అన్నారు. ఇలాంటి వాళ్లు ఎప్పుడూ గెలుస్తారే తప్ప ఓటమిని ఎదుర్కోరని అన్నారు.
Advertisement
మీరు కూడా జీవితంలో విజయాన్ని సాధించాలంటే చాణక్యుడు చెప్పిన కొన్ని మాటలను కచ్చితంగా పాటించాలి. ఆయన సూత్రాలు, ఆలోచనలు అవలంబించడం ద్వారా జీవితంలో చాలా త్వరగా విజయాన్ని అందుకోవచ్చు. చాణక్య నీతి ప్రకారం జీవితంలో విజయాన్ని తెచ్చే మొదటి విషయం లక్ష్యాన్ని సాధించాలని అనుకోవడం. దానికోసం ఏం చేస్తున్నారు అనేది చాలా ముఖ్యం. ఎంత చక్కగా ప్రణాళిక వేసుకుని ముందుకు వెళ్తున్నారు అనేది చాలా కీలకం. మీరు ఉన్న చోట మీ చుట్టూ ఉన్న వాళ్ల గురించి మీరు అంచనా వేసి ఉండాలి లేదంటే లక్ష్యం కోసం మీరు వెళ్లే ప్రయాణంలో చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి తెలియని వ్యక్తి పనిలో తప్పులు చేస్తాడు అపజయాన్ని చూస్తాడు. ఒకసారి సమయం వెళ్ళిపోతే తిరిగి రాదు. చాలామంది ఇబ్బందులు వస్తే అక్కడే ఆగిపోతారు.
Advertisement
Also read:
కానీ ముందుకు వెళ్తేనే విజయాన్ని సాధిస్తాడు. జీవితంలో ఎదగాలంటే మీ గురించి మీకు తెలిసి ఉండాలి మీ సామర్థ్యం మీకు తెలిస్తే మీరు ఎలా ప్రయాణించాలో మీకు తెలుస్తుంది. లేదంటే విజయాన్ని సాధించడం కష్టమవుతుంది. గమ్యం వైపు వెళ్లే దారిలో వచ్చిన కష్టాలను ఎదుర్కొనేందుకు మీకంటూ శక్తి కావాలి. సామర్థ్యంతో ఎదుర్కోవాలి అప్పుడే గెలుపు మీ సొంతమవుతుంది. మీతో నడిచే వాళ్ల గురించి మీరు ఒక అంచనాతో ఉండాలి ఎందుకంటే మనతో నడిచే వ్యక్తులు అందరూ మంచి చేస్తారని చెప్పలేము. స్నేహంగా ఉంటూ వెన్నుపోటు పొడవచ్చు. అందుకని మిమ్మల్ని ఓడించే వాళ్ళు ఎవరు మీరు పైకి ఎదిగేందుకు నిచ్చెనలా ఉపయోగపడే వాళ్ళు ఎవరని గుర్తించాలి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి