Advertisement
రాజమౌళి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో హిట్ ని అందుకున్నారు. 23 ఏళ్ల కెరియర్ లో 12 బంపర్ హిట్లను అందుకున్నారు. ఒక్క ఫ్లాప్ కూడా ఎదుర్కోలేదు. హాలీవుడ్ డైరెక్టర్లు తెలుగు సినిమా గురించి మాట్లాడే స్థాయికి టాలీవుడ్ ని తీసుకువెళ్లారు. మగధీర, బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి అతిపెద్ద సినిమాలని ఆయన తీశారు. పెద్ద సినిమాలని పర్ఫెక్ట్ గా తీసే సత్తా ఉన్నాయన ఒక సినిమా విషయంలో మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదే ఈగ సినిమా. ఈగ సినిమా సమయంలో రాజమౌళి పడిన కష్టాలు ఇన్నీ అన్ని కావు. ఈగ టైటిల్ రోల్ లో ఓ సినిమా తీయాలనే ఆలోచన ఆయనకు డైరెక్టర్ అవ్వకముందే ఉందట. చత్రపతి మూవీ షూటింగ్ టైంలో అన్ని భారీ బడ్జెట్ సినిమాలు చేస్తే బాగుండదని ఒక చిన్న సినిమా చేయాలని అనుకున్నారట.
Advertisement
అందుకనే ఇతర దర్శకుల్లా రొమాంటిక్ కామెడీ జోనర్ వంటి జానర్లు ఈయనకి నచ్చవు వాటిపై ఆయనకు అవగాహన కూడా లేదు. అందుకనే ఆ వాటి జోలికి వెళ్లకుండా ఎక్స్పరిమెంటల్ మూవీ చేద్దామని అనుకున్నారు. అలా ఈగ కాన్సెప్ట్ జ్ఞాపకం వచ్చింది. బలహీనుడు బలవంతుడిపై నెగడం అనే ఒక పాయింట్ తీసుకుని ఈగ మూవీ చేశారు రెండున్నర కోట్లలో ఈ సినిమాని రూపొందించి కొన్ని ప్రాంతాల్లోనే విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ ఆ లిమిటెడ్ బడ్జెట్ లో సినిమా తీయడం అస్సలు కుదరలేదు. అప్పుడు నిర్మాత సురేష్ బాబు బడ్జెట్ గురించి పట్టించుకోవద్దని కథని రెడ్డి చేయండి అని చెప్పారట జక్కన్న స్క్రిప్ట్ మొత్తం రెడీ చేసుకున్నారు కట్ చేస్తే పెద్ద సినిమాగా మారిపోయింది ఈగని విజువల్ గా సినిమా మొత్తం చూపించాల్సిన మరో ఛాలెంజ్ కూడా ఆయనకి గుర్తొచ్చింది.
Advertisement
‘
Also read:
ఆ టైంకి యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గురించి పెద్దగా నాలెడ్జ్ లేదు దాంతో ఈగను క్రియేట్ చేసే బాధ్యత మకుట సంస్థకి ఇచ్చారు. ఎనిమిది నెలల కష్టపడి దీనిని క్రియేట్ చేశారు. కానీ క్రియేట్ చేసిన ఈగ అసలు ఈగలానే లేదట ఈగ పార్ట్ పక్కన పెట్టి మిగతా షూటింగ్ మొత్తం అప్పటికే పూర్తి చేశారు 10 కోట్లు అయింది ఈగ క్లోజప్ లో భయంకరంగా వికృతంగా కనపడింది. ఆ ఫిజికల్ ఫీచర్స్ తొలగించి బాగున్నవి మాత్రమే ఉంచి ఈగని తయారు చేయాలని జక్కన్న అన్నారట. 40 కోట్ల బడ్జెట్ తో వారాహి చలనచిత్ర బ్యానర్లో సాయి కొర్రపాటి ఈగ మూవీని ప్రొడ్యూస్ చేశారు. 100 కోట్లని ఈ సినిమా కలెక్ట్ చేసింది.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!