Advertisement
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురై తీవ్ర గాయాల పాలైన విషయం అందరికీ తెలిసిందే. దీంతో ఆయన అభిమానులంతా ఆందోళనలో ఉన్నారు. గత శుక్రవారం తెల్లవారుజామున ఉత్తరాఖండ్ లోని రూర్కి ప్రాంతంలో రిషబ్ కారు ప్రమాదానికి గురై మంటల్లో కాలిపోయింది. అయితే, ఈ ప్రమాదం నుంచి పంత్ ను ఓ బస్ డ్రైవర్ కాపాడాడు. ప్రమాదంలో గాయపడి అప్పటికే రక్తం కారుతున్న శరీరంతో ఉన్న పంత్ గాయపడ్డ తర్వాత బస్ డ్రైవర్ తో పలికిన తొలి మాటలను తాజాగా బస్ డ్రైవర్ సుశీల్ కుమార్ వెల్లడించాడు. అంత బాధలో ఉండి కూడా పంత్ పలికిన తొలి మాటలు వింటే మనకు సైతం కన్నీళ్లు ఆగవు.
Advertisement
న్యూ ఇయర్ వేడుకలను ఫ్రెండ్స్ తోనో లేక సన్నిహితులతోనో ఎంజాయ్ చేయాలని చాలామంది అనుకుంటారు. కానీ కొద్దిమంది మాత్రమే కుటుంబంతో కలిసి జరుపుకుందాం అనుకుంటారు. అలాగే అనుకున్నాడు టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్. కుటుంబంతో కలిసి కొత్త సంవత్సర వేడుకలను జరుపుకోవడానికి తన ఇంటికి బయలుదేరాడు పంత్. కానీ దురదృష్టవశాత్తు కారు ప్రమాదానికి గురైంది. ఈ యాక్సిడెంట్ లో పంత్ ప్రాణాలతో బయటపడ్డప్పటికీ అతడు అనుభవించిన బాధ మాత్రం వర్ణనాతీతం. ఇక పంత్ గాయపడ్డ సమయంలో మాట్లాడిన తొలి మాటలను తాజాగా వెల్లడించాడు పంత్ ను కాపాడిన బస్ డ్రైవర్.
Advertisement
యాక్సిడెంట్ అయ్యి, కాలిన గాయాలతో అంత బాధలో ఉన్నప్పటికీ పంత్ అతడి కుటుంబం కోసం ఆలోచించాడని, నేను అతడిని కలుసుకోగానే “మా అమ్మకు ఫోన్ చెయ్యవా ప్లీజ్” అంటూ పంత్ నాతో చెప్పాడు. ఆ మాటలో ప్రేమ, బాధ రెండూ కలిపి ఉన్నాయి. ఆ మాట వినగానే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతడు చెప్పినట్లుగానే నేను ఫోన్ చేశాను. ఆ తర్వాత అతడిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తీసుకెళ్లాం. ఏ వ్యక్తికైనా సరే తాను ప్రమాదంలో ఉన్నప్పుడు మొదటిగా గుర్తుకు వచ్చేది కుటుంబమే. ముఖ్యంగా మనకు జన్మనిచ్చిన కన్న తల్లి. పంత్ కు సైతం ఇలాగే గుర్తుకు వచ్చింది తన మాతృమూర్తి. ప్రస్తుతం బస్ డ్రైవర్ సుశీల్ కుమార్ చెప్పిన పంత్ తొలిమాటలు నెట్టెంట వైరల్ గా మారాయి.
Read also: SAMANTHA : సమంత ఆస్తుల విలువ ఎంతంటే..?