Advertisement
అతడు సినిమా మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ. ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటించింది. సినిమాలో సోనుసూద్ మహేష్ బాబుకు స్నేహితుడిగా నటించి అతడినే మోసం చేసే పాత్రలో కనిపిస్తాడు. ఈ సినిమాలో త్రివిక్రమ్ రాసిన మాటలు బుల్లెట్లల దూసుకుపోతాయి.
Advertisement
సినిమాలోని ఒక్కో డైలాగ్ ఒక్కో రేంజ్ లో ఉండటంతో థియేటర్స్ లో విజిల్స్ పడ్డాయి. ఇక ఇలాంటి సినిమాను టాలీవుడ్ లో చాలామంది స్టార్స్ మిస్ చేసుకున్నారు. నిజానికి మొదట త్రివిక్రమ్ అతడు సినిమా కథను ఉదయ్ కిరణ్ తో చేయాలనుకున్నాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ను కూడా ఈ సినిమా కోసం త్రివిక్రమ్ కలిశాడు.
Advertisement
Actor Venu Thottempudi
కానీ చివరికి మహేష్ బాబు చేశాడు ఈ సినిమా. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి మరో ఆసక్తికర విషయం తాజాగా తెలిసింది. ఈ చిత్రంలో సోనుసూద్ పాత్ర కోసం త్రివిక్రమ్ తనను సంప్రదించాడని తొట్టెంపూడి వేణు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కానీ తాను సినిమా చేయనని చెప్పినట్టు తెలిపారు. త్రివిక్రమ్ తనకు చాలా మంచి పాత్రలు ఆఫర్ చేశాడని, కానీ తానే రిజెక్ట్ చేశానని వెల్లడించారు.
Read Also : ఉదయ్ కిరణ్ తో మల్టీస్టారర్ మూవీ..నో చెప్పిన తరుణ్.. ఆ సినిమా ఏంటంటే..?