Advertisement
Tiger Nageswara rao Review in Telugu: టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రవితేజ, నుపూర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ తదితరులు నటించారు. వంశీ దర్శకత్వం వహించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాని నిర్మించారు. జి వి ప్రకాష్ సంగీతాన్ని అందించారు.
Advertisement
చిత్రం : టైగర్ నాగేశ్వరరావు
నటీనటులు : రవితేజ, నుపూర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ తదితరులు
దర్శకత్వం : వంశీ
నిర్మాత : అభిషేక్ అగర్వాల్
సంగీతం : జి వి ప్రకాష్
విడుదల తేదీ : అక్టోబర్ 20, 2023
టైగర్ నాగేశ్వరరావు కథ మరియు వివరణ:
ఇక కథ లోకి వెళితే.. ప్రైమ్ మినిస్టర్ (అనుపమ్ ఖేర్) కి, గుంటూరు ఎస్పీ (మురళీ శర్మ) మాట్లాడుతూ వుంటారు. టైగర్ నాగేశ్వరరావు (రవితేజ) కథ ని ఆయన చెప్పడం జరుగుతుంది. ఇలా మూవీ స్టార్ట్ అవుతుంది. స్టువర్టుపురంలో ఉండే స్టువర్టుపురం నాగేశ్వరరావు యుక్త వయసులో సారా (నుపుర్ సనన్) అనే అమ్మాయిని లవ్ చేస్తాడు. అక్కడ జరుగుతున్న కొన్ని సంఘటనల కారణంగా స్టువర్టుపురం నాగేశ్వరరావు మారుతాడు. అయితే, మరి స్టువర్టుపురం నాగేశ్వరరావు కి ఎదురైనా సంఘటనలు ఏవి..? స్టువర్టుపురం నాగేశ్వరరావు టైగర్ నాగేశ్వరరావు గజదొంగగా ఎందుకు మారాడు..?
Advertisement
కారణం ఏమిటి..? ఒక వీవీఐపీ ఉన్నచోట చోరీ ఎందుకు చేస్తాడు..? ఊరిలో ఎలాంటి మార్పు ని అతను తీసుకు వస్తాడు..? స్టువర్టుపురం దొంగని పట్టుకోవాలని ప్రైమ్ మినిస్టర్ ఎందుకు ఆర్డర్ వేశారు…? టైగర్ నాగేశ్వరరావుని పోలీసులు ఆఖరికి పట్టుకున్నారా..? ఇవన్నీ సినిమా చూసి తెలుసుకోవాలి. నిజ జీవిత సంఘటన ఆధారంగా ఈ మూవీ ని తీసుకు వచ్చారు.
ఈ సినిమా స్టార్టింగ్ ని బాగా స్టార్ట్ చేశారు. ఈ మూవీ మొత్తం 1980 లోనే నడుస్తుంది. ఊరిలో జరిగే సంఘటనలు ని బాగా చూపారు. కానీ లవ్ ట్రాక్ స్టార్ట్ అయ్యాక చాలా అనవసరమైనవి వస్తూ ఉంటాయి. లవ్ స్టోరీ కొంచెం ఇడియట్ సినిమా లవ్ స్టోరీ లానే ఉంటుంది.
అసలు ఈ స్టోరీ లేకపోయినా కూడా సినిమా బాగానే ఉండేది. సినిమా ట్రాక్ తప్పిందేమో అనిపిస్తుంది. రాబరీ సీన్స్ కొన్ని బాగా రాసుకున్నారు. అవి తెరపై కూడా బాగా కనిపించాయి. యాక్షన్ సీన్స్ బాగా డిజైన్ చేశారు. కానీ స్క్రీన్ ప్లే ఇంకా కొంచెం టైట్ గా ఉంటే బాగుండేది. సెకండ్ హాఫ్ లో రాబిన్ హుడ్ స్టైల్ కి మూవీ వెళ్ళిపోతుంది. హీరో దొంగ. దోచేసి ఆ డబ్బు పెదాలకి ఇస్తాడు. ఇలా కథ ఏటో వెళ్లిపోతుంది. సీన్స్ ని కూడా సాగదీసినట్టు అనిపిస్తుంది. ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఫస్ట్ హాఫ్ లో బావుంది. రవితేజ నటన అయితే సూపర్. సినిమాటోగ్రఫీ కూడా బావుంది. దర్శకుడు కథ ని బాగా ఎంచుకున్నారు. సెకండ్ హాఫ్ విషయంలో జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది.
ప్లస్ పాయింట్స్:
నటులు
స్టోరీ
యాక్షన్ సీన్స్
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
పెద్ద సినిమా
లవ్ ట్రాక్
రెండవ పార్ట్
బోరింగ్ సీన్స్
రేటింగ్: 2.75/5