Advertisement
ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల కంటే కోట్లాది రూపాయల పారితోషికాలు విలన్ లకు కూడా ఉంటాయి.. హీరో హీరోయిన్ ఏ విధంగా అయితే ప్రేక్షకులను అలరిస్తారో అదే రేంజ్ లో ప్రతి నాయకుడి పాత్ర కూడా ఉంటుంది.. ఇక పారితోషికం విషయానికి వస్తే విలన్స్ కి చాలా తక్కువగా ఉంటుంది. అయితే దీనిపై చాలామంది విలన్స్ వారితో సమానంగా మాకు ఎందుకు పారితోషకం ఇవ్వకూడదని ప్రశ్నలు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.. ఇదంతా పక్కన పెడితే.. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రతినాయకుడి పాత్ర చేసే వారికి కూడా కోటి రూపాయల పారితోషికం ఇస్తున్నారు నిర్మాతలు..
Advertisement
మరి కోట్లాది రూపాయల పారితోషికం తీసుకునే ప్రతి నాయకులు ఎవరో మనం ఇప్పుడు చూద్దాం.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో చాలామంది దర్శకులు హీరోలను ఏ విధంగా అయితే హైలెట్ చేస్తున్నారో, విలన్స్ ని కూడా అదే విధంగా హైలెట్ చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో ఉండే కొంతమంది స్టార్ విలన్స్ గురించి ఇప్పుడు చూద్దాం.. సోనూసూద్,ప్రకాష్ రాజ్,జగతిబాబు లాంటివాళ్ళకు ఇండస్ట్రీలో చాలా డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్లు విలన్ గానే కాకుండా ఏ పాత్ర వచ్చినా అందులో నటించడమే కాకుండా జీవించేస్తారు. మరి ఇండస్ట్రీలో అలా భారీ పారితోషికం తీసుకునే విలన్స్ ఎవరంటే..
జగపతి బాబు :
ఇండస్ట్రీలో హీరోగా,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా,విలన్ గా ఎన్నో సినిమాలు చేస్తున్నారు. ఆయన పారితోషికం కోటి నుంచి కోటిన్నర ఉంటుంది.
Advertisement
శ్రీకాంత్ :
చాలా సినిమాల్లో విలన్ గా చేసి హీరోగా ఎదిగాడు.. ఈయన కూడా కోటి కి పైగానే పారితోషికం తీసుకుంటారట.
ప్రకాష్ రాజ్ :
also read:మణిరత్నం “పొన్నియన్ సెల్వన్” చూసాక మీకు ఇదే డౌట్ వచ్చిందా ? ఇది నిజమే నా అస్సలు నమ్మలేరు !
ఈయన ఒక రోజుకు పది లక్షలకు పైనే రెమ్యూనరేషన్ తీసుకుంటారట. ఇక కొన్ని సినిమాలకు అయితే కోటిన్నర వరకు తీసుకుంటారట.
సోను సూద్ :
చాలా మంది హీరోలు సినిమాల్లో మాత్రమే హీరో గా కనిపిస్తారు. కానీ సోనూసూద్ మాత్రం రియల్ లైఫ్లో కూడా హీరోనే.. ఈయన ఒక సినిమాకు మూడు కోట్ల వరకు తీసుకుంటారట.
మిర్చి సంపత్ రాజ్ :
సినిమాతో స్టార్ విలన్ గా ఎదిగాడు సంపత్ రాజ్. ఈయన ఒక సినిమాకు 40 లక్షల పైగానే పారితోషికం అందుకుంటారట.
ఆది పినిశెట్టి:
స్టైలిష్ విలన్ల లో ఆది పినిశెట్టి ఒకరు. ఈయన కూడా కోటికి పైగానే రెమ్యూనరేషన్ తీసుకుంటారట
హరీష్ ఉత్తమన్ : ఈయన తమిళ్ విలన్. ఒక సినిమాకి 30 లక్షల వరకు ఛార్జ్ చేస్తారట.
also read: