Advertisement
ఇప్పటికే టాలీవుడ్ వారసుల పరంపర కొనసాగుతోంది. దాదాపుగా మూడో తరం వారసులు కూడా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలుగా వెలుగుతున్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, రామానాయుడు తరం తర్వాత వాళ్ళ వారసులు బాలకృష్ణ,నాగార్జున,వెంకటేష్ టాలీవుడ్ లో స్టార్ హీరోలు గా కొనసాగుతున్నారు. తన స్వయంకృషితో మెగా స్టార్ గా ఎదిగిన చిరంజీవి కుటుంబం నుంచి కూడా దాదాపుగా చాలా మంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం మూడో తరం స్టార్ హీరోలుగా ఎదిగిన ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రెండో తరం వారసులుగా మహేష్ బాబు మొదలైన వారు ఉన్నారు. వీరి వారసులు కూడా అప్పుడే టాలీవుడ్ లో అడుగు పెట్టి మంచి గుర్తింపు కోసం పరిగెడుతున్నారు. మరి వారెవరో ఓ లుక్కేద్దాం..?
Advertisement
అకీరా నందన్ :
పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ ఇప్పటికే చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఆరున్నర అడుగుల ఎత్తుతో అచ్చం హీరో లా ఉన్న అకీర పవన్ ఫ్యాన్స్ జూనియర్ పవర్ స్టార్ అని ముద్దుగా పిలుస్తారు.
గౌతమ్ :
మహేష్ బాబు కొడుకు గౌతమ్, ఇప్పటికే “వన్ నేనొక్కడినే” సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా జూనియర్ మహేష్ గా నటించి అందరితో శభాష్ అనిపించుకున్నాడు గౌతమ్. మరి ఈయన ఫ్యూచర్ లో స్టార్ హీరో గా ఎదుగుతాడో లేదో ముందుముందు చూడాలి..
Advertisement
మోక్షజ్ఞ :
బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ గత ఏడాదిలోనే హీరో గా ఎంట్రీ ఇవ్వాల్సి ఉండగా, కానీ అతడి ఎంట్రీ గ్రాండ్ గా ఉండాలని మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారట బాలకృష్ణ.
అర్జున్ :
“గోపాల గోపాల” సినిమా ద్వారా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు వెంకటేష్ కొడుకు అర్జున్. ఆయన ప్రస్తుతం స్టడీస్ పై ఫోకస్ పెట్టారు. చదువు ముగిసిన వెంటనే టాలీవుడ్ హీరో గా ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది.
మహదేవన్ :
రవితేజ కొడుకు మహదేవన్ “రాజా ది గ్రేట్” సినిమా తో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి తన నటనతో అందరిని మెప్పించాడు. చదువు పూర్తయిన తరువాత నటనపై ఆసక్తి ఉంటే హీరో గా ఎంట్రీ ఇస్తారని ఒకానొక సందర్భంలో రవితేజ గారే స్వయంగా చెప్పారు.
also read:
ఇండియాలో ఫోన్ నెంబర్ కి 10 అంకెలే ఎందుకు ఉంటాయి?