Advertisement
చాలామంది సీనియర్ హీరోలు ఇప్పుడు కూడా సినిమాలు చేస్తున్నారు. వయసు ఎక్కువైనా కూడా మేకప్ తో కవర్ చేసుకుంటూ సినిమాల్లో కనబడుతున్నారు. అయితే ఎప్పటినుండో కూడా టాలీవుడ్ హీరోలు ఎందుకు ఇలా చేస్తున్నారనేది ప్రశ్నార్థకంగానే ఉంది. ఎప్పటి నుండో కూడా తమిళవారు నేటివిటీకి దగ్గరగా మనం సినిమాలు తీస్తున్నాము అని పేరు ఉంది. నిజానికి చాలా సౌత్ ఇండియన్ సినిమాలని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది. మన తెలుగు సినిమాలే కానీ సీనియర్ హీరోలు మాత్రం ఇంకా ఘోరమైన కథల్ని ఎంపిక చేసుకుంటున్నారు.
Advertisement
అది చూసి ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమిళ హీరోలు అందానికి అంతలా ప్రాధాన్యత ఇవ్వకుండా సినిమాలకి తగ్గట్టుగా తయారవుతున్నారు. కానీ ఇక్కడ తెలుగు హీరోలు మాత్రం మేకప్ వేసుకుంటూ కథని అసలు దృష్టిలో పెట్టుకోవడం లేదు. అక్కడ అజిత్, రజనీకాంత్ వంటి వాళ్ళు ఎప్పుడూ కూడా వయసు కనపడకుండా ఉండాలని ట్రై చేయడం లేదు.
Advertisement
కథని బట్టి ఎలాంటి పాత్ర చేయడానికి అయినా సిద్ధమవుతున్నారు. కానీ తెలుగు హీరోల్లో అలా లేదు. తమిళ్ హీరోలని చూసుకున్నట్లయితే జుట్టు నెరిసిన కూడా లుక్స్ కి అస్సలు ప్రాధాన్యత ఇవ్వట్లేదు. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వచ్చిన జైలర్ సినిమాలో చూస్తే ఒక హీరోయిన్ లేదు. అనవసరమైన పాట లేదు. కానీ తెలుగులో ఇలాంటివి జరగడం లేదు ఇలాంటి సినిమాల్లో కూడా మన హీరోలు ఐటమ్ సాంగ్స్ ని పెట్టేయడం, సాంగ్స్ లో యంగ్ గా కనపడడానికి ట్రై చేయడం వంటివి చేస్తున్నారు.
చాలామంది తెలుగు హీరోలు ఇలానే చేస్తున్నారు. ఆరుపదులు వయసు దాటిపోయిన కూడా కుర్ర హీరోయిన్లని సినిమాల్లో పెట్టుకుని పాటలు, డాన్సులు చేస్తున్నారు. వాళ్ళు ఏదో చిన్న వయసు వాళ్ళ అన్నట్లు కవరింగ్ ఇస్తున్నారు. సినిమాలు ఫ్లాప్ అయినా కూడా తీరు మారడం లేదు. పైగా కథలు కూడా రొటీన్ గానే ఉంటున్నాయి తెలుగు హీరోలు మారితే నిర్మాతలకి నష్టం కలగదు. టాలీవుడ్ ప్రేక్షకులకి నిరాశ ఉండదు. మరి ఇప్పటికైనా సరే కథల విషయంలో తెలుగు హీరోలు ఆచితూచి అడిగేస్తే బాగుంటుంది. సినిమా ఫ్లాప్స్ చూసైనా మారుతారేమో చూడాలి.
Also read: