Advertisement
టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ఉన్న ప్రతిభ అంతా ఇంతా కాదు. ఎన్నో భారీ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది చిత్ర పరిశ్రమ. ఇందులో లవ్, యాక్షన్ మరియు క్రైమ్ ఇతర సినిమాలు కూడా ఉన్నాయి. అయితే, ఈ 10 సినిమాలు ఇండస్ట్రీ హిట్లు కాదు. కానీ ఇండస్ట్రీ హిట్లుగా ప్రొజెక్ట్ అయ్యాయి. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
Advertisement
#పసివాడి ప్రాణం
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ గా ప్రోజెక్ట్ అయ్యింది. కానీ ఇది ఇండస్ట్రీ హిట్ కాదు. ఏ. కోదండరామిరెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు.
#అత్తకు యముడు అమ్మాయికి మొగుడు
చిరంజీవి నటించిన ఈ మూవీ కూడా ఇండస్ట్రీ హిట్ గా ప్రోజెక్ట్ అయ్యింది. కానీ కాదు. దీనికి కూడా ఏ.కోదండరామిరెడ్డి దర్శకుడు.
# యముడికి మొగుడు
రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రూపొందిన ఈ మూవీ కూడా ఇండస్ట్రీ హిట్ అని అంతా అనుకుంటారు. కానీ కాదు.
#ఖుషి
పవన్ కళ్యాణ్ హీరోగా ఎస్.జె.సూర్య దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కూడా ఇండస్ట్రీ హిట్ అని ప్రచారం జరిగింది. ఇది కూడా ఇండస్ట్రీ హిట్ కాదు. పవన్ కెరియర్ లో ‘అత్తారింటికి దారేది’ మాత్రమే ఇండస్ట్రీ హిట్ మూవీ.
# సింహాద్రి
Advertisement
ఎన్టీఆర్-రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ కూడా ఇండస్ట్రీ హిట్ అనుకుంటారు. కానీ ఎన్టీఆర్ కెరియర్ లో మాత్రమే ఇది బిగ్గెస్ట్ సక్సెస్ సాధించిన మూవీ. ఇండస్ట్రీ హిట్ కాదు. నిజానికి ఎన్టీఆర్ కెరియర్ లో ఆర్ఆర్ఆర్ తప్ప మరో ఇండస్ట్రీ హిట్ మూవీ లేదు.
#ఠాగూర్
చిరంజీవి-వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ ని కూడా అంత ఇండస్ట్రీ హిట్ అనుకుంటారు. కానీ కాదు. ఆ టైంకి చిరు ఇంద్రతో ఇండస్ట్రీ హిట్ కొట్టారు.
#దూకుడు
మహేష్ బాబు హీరోగా, శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కూడా ఇండస్ట్రీ హిట్ అని ప్రచారం జరిగింది. కానీ కాదు. మహేష్ కెరియర్ లో పోకిరి మాత్రమే ఇండస్ట్రీ హిట్.
# గబ్బర్ సింగ్
పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కూడా ఇండస్ట్రీ హిట్ అని ప్రచారం జరిగింది. కానీ ఇది కూడా ఇండస్ట్రీ హిట్ కాదు.
#అలా వైకుంఠపురంలో
అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ కూడా నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్. కానీ ఇండస్ట్రీ హీట్ గా ప్రచారం చేశారు.
#సరిలేరు నీకెవ్వరు
మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ కూడా ఇండస్ట్రీ హిట్ అంటూ ప్రచారం చేసుకున్నారు, కానీ కాదు.
Read also: యాంకర్ సుమ ఇంటిని ఏయే సినిమాల షూటింగ్‌లకు ఉపయోగించారో తెలుసా..?