Advertisement
suryakantham family: ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో గయ్యాలి పాత్రలకు పెట్టింది పేరుగా ఉండేది నటి సూర్యకాంతం. ఈమె ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి గొప్ప నటిగా పేరు సంపాదించుకుంది. ఒకప్పుడు సూర్యకాంతం డేట్స్ కోసం దర్శక నిర్మాతలు ఎదురుచూసేవారు. ఆమె డేట్స్ కోసం సినిమా షూటింగ్ లను సైతం వాయిదా వేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయట. సూర్యకాంతం అంటే ఇప్పటి జనరేషన్ వాళ్లకు తెలియదు కానీ అప్పట్లో ఈమె చాలా ఫేమస్. అప్పట్లో అత్త పాత్ర చేయాలంటే కచ్చితంగా సూర్యకాంతం పేరు చెప్పేవారు చాలామంది. అయితే సినిమాలలో గయ్యాళి పాత్రలో నటించినప్పటికీ ఆమె నిజ జీవితంలో మాత్రం చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన మనిషి.
Advertisement
Read also: RANA NAIDU WEB SERIES REVIEW: రానా నాయుడు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్
ఈమె తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దగ్గర ఉన్న వెంకటకృష్ణ రాయపురంలో 1924 అక్టోబర్ 28న ఆమె తల్లిదండ్రులకు 14వ సంతానంగా జన్మించింది. సినిమాల్లో నటించాలని కోరిక ఆపుకోలేక చెన్నై చేరుకుంది. ఇండస్ట్రీలో తన కెరీర్ మొదలుపెట్టి దాదాపు 40 సంవత్సరాలు పాటు తన సినీ ప్రస్థానంలో ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అయితే అప్పటి మద్రాస్ హైకోర్టు జడ్జిని వివాహం చేసుకున్నారు సూర్యకాంతం. తద్వారా ఆమె మద్రాసులో నివసించాల్సి వచ్చింది. ఆ తరువాత హైదరాబాద్ లో ఇంటిని నిర్మించుకొని చివరి వరకు హైదరాబాదులోనే ఉన్నారు. అంతేకాదు హైదరాబాద్, కాకినాడ తో పాటు ఇతర ప్రాంతాలలో సత్రాలను ఏర్పాటు చేసి అనాధలను చేరదీశారట.
Advertisement
అంతేకాకుండా చెన్నైలో ఎంతోమంది భర్తలేని స్త్రీలను ఆర్థికంగా ఆదుకున్నారట సూర్యకాంతం. అయితే వృత్తిరీత్యా సూర్యకాంతం భర్త జడ్జ్ అయినప్పటికీ షూటింగ్ లో సూర్యకాంతం బిజీగా ఉంటే ఆమె కోసం స్టూడియోల ముందు వేచి చూసేవారట. సూర్యకాంతం భర్తకి బయటి భోజనం తినే అలవాటు లేదట. దాంతో సినిమా షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్నా సరే ఇంట్లో పని మొత్తం పూర్తి చేసి వెళ్లేదట సూర్యకాంతం. అయితే హైదరాబాద్, విశాఖపట్నం, చెన్నై నగరాల్లో ఇప్పటికీ సూర్యకాంతం నిర్మించిన సత్రాలు, పాఠశాలలు ఎంతో మందిని ఆదరించి సేవలను అందిస్తున్నాయి. సూర్యకాంతం తన చివరి శ్వాస వరకు ఎంతో ఉన్నతంగా బతికి నలుగురిని బ్రతికించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
Read also: రాజమౌళి అమ్మగారు చిరంజీవికి బంధువు అని తెలుసా..? ఎలాగంటే..?