Advertisement
Gaami Movie Review In Telugu: దాదాపు ఐదేళ్ల పాటు షూటింగ్ జరుపుకున్నటువంటి తెలుగు మూవీ గామి. వాస్తవానికి విశ్వక్ సేన్ నటించిన తొలి మూవీ గామి అయినప్పటికీ ఇది ఆలస్యం అయింది. ఈ చిత్రం ట్రైలర్ విడుదల కాగానే విజువల్స్ చూసిన ప్రేక్షకులు ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందా..? అనే ఆసక్తి కనబరిచారు. మహాశివరాత్రి కానుకగా మార్చి 08, 2024న థియేటర్లలోకి వచ్చేసింది. ఈ సినిమా ఎలా ఉంది.. అంచనాలకు మించి హిట్ కొట్టిందా..? లేదా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
సినిమా : గామి
నటీనటులు : విశ్వక్ సేన్, చాందిని చౌదరి, అభినయ, హారిక తదితరులు
నిర్మాతలు : కార్తిక్ శబరీష్, శ్వేత మొరవనేని
రచన-దర్శకత్వం : విధ్యాదర్ కాగితాల
సంగీతం : నరేష్ కుమారన్, స్వీకర్ అగస్తీ
సినిమాటో గ్రఫీ : విశ్వనాథ్ రెడ్డి, ర్యాంపీ నందిగాం
విడుదల తేదీ : మార్చి 08, 2024
కథ మరియు విశ్లేషణ :
శంకర్ (విశ్వక్ సేన్) హరిద్వార్ లో ఉండే ఓ అఘోరా. ఇతనికి ఓ విచిత్రమైన సమస్య. ఎవరైనా పొరపాటున తాకితే శంకర్ ఒళ్లు అంతా నీలం రంగులోకి మారిపోతుంది. స్పృహ తప్పి పడిపోతాడు. ఇతని వల్ల తమకు ఇబ్బంది కలుగుతుందని మిగతా అఘోరాలు అందరూ ఇతడినీ ఆశ్రమం నుంచి వెళ్లగొడతారు. దీంతో తన సమస్యకు పరిష్కారం తెలుసుకునేందుకు కాశీకి వెళ్తాడు. హిమాలయాల్లో 36 ఏళ్లకు ఒకసారి లభించే మాలిపత్రాలే తీసుకుంటే ఇది నయం అవుతుంది. దీంతో శంకర్ హిమాలయాలకు ప్రయాణం మొదలుపెడతాడు. ఇతనికి జాహ్నవి కూడా తోడు వెళ్తుంది. చివరికీ మాలి పత్రాలను సాధించాడా..? లేదా అలాగే శంకర్ ఆలోచనలలో వచ్చే ఉమ (హారిక పెద్ద), సిటీ333(మహమ్మద్ సమద్) ఎవరు..? అనే విషయాలు తెలియాలంటే మాత్రం గామి మూవీని థియేటర్లలో చూడాల్సిందే.
Advertisement
వాస్తవానికి రెగ్యులర్ సినిమాలు చూసేవాళ్లకు ఈ సినిమా అంతగా నచ్చదు. హాలీవుడ్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఉండే సినిమాలు చూసే వారికి నచ్చుతుంది. ఏదో కావాలని పెట్టినట్టు ఇంటర్వెల్ పడుతుంది. ఫస్టాప్ వేగంగా నడుస్తుంది. సెకండాఫ్ నెమ్మదిస్తుంది. చివరికీ సింహం ఓ రెండు, మూడు సీన్లలో కనిపిస్తుంది. ఆ సీన్స్ ని ఇంకాస్త ఎఫెక్టివ్ గా తీసుండాల్సింది. క్లైమాక్స్ హైలెట్. శివ భక్తులను ఈ సినిమా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా కోసం ఏళ్లకు ఏళ్లు కష్టపడిన దర్శకుడు విద్యాధర్ కి ఎంత మెచ్చుకున్నా తక్కువే. కొత్త దర్శకుడు ఈ రేంజ్ లో తీశాడా..? అనుకుంటాం. గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి. సంగీతం సినిమా ప్లస్ అయింది. ఓవరాల్ గా చెప్పుకుంటే గామి ఓ డిఫరెంట్ అటెంప్ట్.
పాజిటివ్ పాయింట్స్ :
- విశ్వక్ సేన్ నటన
- క్లైమాక్స్
- సంగీతం
- సినిమాటోగ్రఫీ
- విజువల్స్
మైనస్ పాయింట్స్ :
- సెకండాప్ స్లోగా సాగడం
- మాస్ ప్రేక్షకులను ఆకర్షించకపోవడం
- కావాలని పెట్టినట్టు ఇంటర్వెల్ పడటం
రేటింగ్ : 3/5
మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!