Advertisement
ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ లాంటి స్టార్స్ తర్వాత టాలీవుడ్ ను రూల్ చేసిన తర్వాతి తరం హీరో మెగాస్టార్ చిరంజీవి. 1980 & 90 ల చివర్లో ఖైదీ, పసివాడి ప్రాణం, ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్, జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి ఇండస్ట్రీ హిట్స్ తో టాలీవుడ్ నెం.1 హీరో అయ్యాడు మెగాస్టార్ చిరంజీవి. దాదాపు 30+ ఏళ్ల ఇండస్ట్రీ, నెం.1 హీరోగా ఉన్న 60+ ఏళ్లలో కూడా సైరా, గాడ్‌ఫాదర్ లాంటి హిట్స్ తో ముందుకు వెళ్తున్నాడు. చిరంజీవి చేసిన 150+ సినిమాలలో ఎన్నో ఇండస్ట్రీ హిట్స్, బ్లాక్ బస్టర్స్, ఎన్నో సూపర్ హిట్స్, కొన్ని అవార్డ్ విన్నింగ్ మూవీస్ మరియు ఇంకొన్ని ఫ్లాప్‌లు ఉన్నాయి. ఐతే చిరు కెరీర్‌లో చిరంజీవి సినిమాలలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
Advertisement
1. సైరా – రూ.360 కోట్లు
ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాడిన తిరుగుబాటుదారుడు కథను బేస్ చేసుకొని చిరంజీవి చేసిన ఈ సినిమా… పాన్-ఇండియా సినిమాగా విడుదల అయ్యి రూ. 300+ కోట్లు వసూలు చేసింది.
2. ఖైదీ నం 150 – రూ. 240 కోట్లు
ఇక మెగాస్టార్ కమ్ బ్యాక్ మూవీ అయిన ఖైదీ నంబర్ 150 బాక్సాఫీస్ దగ్గర దాదాపు రూ. 240+ కోట్లను కలెక్ట్ చేసింది.
3. ఆచార్య – రూ 45-50 కోట్లు
ఇక మొదటి సారి చిరు & చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ఆచార్య సినిమా డిజాస్టర్ టాక్ తో కేవలం 50 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది.
Advertisement
4. ఇంద్ర – రూ. 45-50 కోట్లు
ఇంద్ర సినిమా చిత్ర పరిశ్రమలో ఉన్న అన్నీ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది.
5. ఠాగూర్ – రూ. 40 కోట్లు
ఇక తమిళంలో హిట్ అయిన రమణ సినిమా.. తెలుగులో ఠాగూర్‌గా రీమేక్ చేస్తే 40 కోట్లు సంపాదించింది.
6. స్టాలిన్ – రూ. 35-40 కోట్లు
స్టాలిన్…మూవీ బాక్సాఫీస్ వద్ద దాదాపు 40 కోట్లు వసూలు చేసింది.
7. శంకర్ దాదా M.B.B.S – రూ.35+ కోట్లు
హిందీ లో మున్నా భాయ్ గా హిట్ కొట్టిన సినిమాని శంకర్ దాదా M.B.B.S గా రీమేక్ చేసి చిరు ఒక అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనింగ్ హిట్ ఇచ్చాడు.
8. శంకర్ దాదా జిందాబాద్ – రూ. 25-30 కోట్లు
శంకర్ దాదా జిందాబాద్ యావరేజ్ టాక్ తో 25+ కోట్ల బిజినెస్ చేసింది.
9. జై చిరంజీవ – రూ. 25-30 కోట్లు
ఇక విజయ్ భాస్కర్ డైరెక్షన్ లో త్రివిక్రమ్ కథ ఇచ్చిన జై చిరంజీవ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ టాక్ తో 25+ కోట్ల బిజినెస్ చేసింది.
10. అందరివాడు – రూ. 25 కోట్లు
చిరు ద్విపాత్రాభినయం చేసిన అందరివాడు సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.25 కోట్ల బిజినెస్ చేసింది.