Advertisement
ఇప్పుడు మల్టీ స్టారర్ సినిమాలు రావడం మనం చూస్తున్నాం. ఇది వరకు బిగ్ స్టార్స్ ఆయా ఇండస్ట్రీస్ స్టార్స్ తో కలిసి కనిపించేవారు. కానీ మళ్ళీ వేరే ఇండస్ట్రీకి చెందిన టాప్ హీరోలు ఒకే సినిమాలో కనపడుతుంటే బాక్స్ ఆఫీస్లు బద్దలవుతున్నాయి. అందుకు చక్కని ఉదాహరణ కల్కి 2898 ఏడి. ఈ చిత్రంలో ప్రభాస్, అమితాబచ్చన్, కమల్ హాసన్ వంటి లెజెండ్స్ కనపడి అదరగొట్టేసారు. సినిమా కూడా పెద్ద హిట్ ని అందుకుంది. ఒక కుటుంబానికి చెందిన బిగ్ స్టార్స్ కలయికలో వచ్చిన మల్టీ స్టార్స్ ఒకింత ఆసక్తిగా ఉంటాయి ఈ తరహా మల్టీ స్టార్ చిత్రాలు మాత్రం కొంచెం తక్కువే ఉంటాయి.
Advertisement
అలాగే అక్కినేని కుటుంబం నుండి వచ్చిన మనం సినిమా కూడా తెలుగులో ఒక బ్యూటిఫుల్ సినిమాగా మర్చిపోలేని సినిమాగా వచ్చింది. అక్కినేని కుటుంబం మూడు తరాలు కనిపించి బెస్ట్ మల్టీ స్టారర్ గా ఈ సినిమా నిలిచింది. దర్శకుడు విక్రమ్ కే కుమార్ ఈ మూవీ తో ప్రశంసలు అందుకున్నారు, ఈ తరహా కథలు మాత్రం టాలీవుడ్ లో మిగతా కుటుంబ హీరోస్ కి కనపడలేదు అని చెప్పాలి. రానా, వెంకటేష్ రానానాయుడు అనే వెబ్ సిరీస్ చేశారు తప్ప ఎలాంటి సినిమా కూడా చేయలేదు.
Advertisement
Also read:
Also read:
హరీష్ శంకర్ తాజాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, చిరు వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి తగ్గ పర్ఫెక్ట్ ఐడియా నా దగ్గర ఉందని హరిశంకర్ అన్నారు. అన్ని పాన్ ఇండియా సినిమాలు అంటారే కానీ దానికి మించి వీరి ముగ్గురు సినిమాపై వర్క్ చేస్తున్నట్లు చెప్పారు. ఈ ముగ్గురు కలిసి ఒక సినిమాలో చూడడం ఇప్పటివరకు జరగలేదు. చిరు, చరణ్, పవన్ కళ్యాణ్ ఇలా ముగ్గురు కూడా ఓ సినిమాలో కనిపిస్తే సూపర్ గా ఉంటుంది. మరి హరీష్ శంకర్ ఎలా డిజైన్ చేస్తారు..? ముగ్గురు కలిసి ఎలా నటిస్తారు అనేది చూడాల్సి ఉంది.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!