Advertisement
మనం వంట చెయ్యాలంటే, కచ్చితంగా గ్యాస్ సిలిండర్ ఉండాలి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా, గ్యాస్ సిలిండర్ మీద ఆధారపడిపోయాము. గ్యాస్ సిలిండర్ లేకపోతే వంట పూర్తి కాదు. ఎలక్ట్రిక్ స్టవ్ కానీ రైస్ కుక్కర్ గాని ఉంటే కొన్ని ఈజీగా అయిపోతాయి. కానీ అన్ని వాటి మీద అవ్వవు. అందుకని గ్యాస్ సిలిండర్ ని పక్కా పెట్టుకోవాల్సిందే. కొన్ని సందర్భాల్లో వంట పూర్తవకముందే గ్యాస్ సిలిండర్ అయిపోతుంది. స్పేర్ సిలిండర్ ఉండకపోతే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అయితే సిలిండర్ వలన సమస్య రాకుండా ఉండాలంటే ఎంతవరకు గ్యాస్ ఉంది అనేది తెలుసుకుంటే మంచిది.
Advertisement
Advertisement
సిలిండర్ అయిపోవడం వలన మనకి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. కొంతమంది సమస్య రాకూడదని రెండు సిలెండర్ లని మెయింటైన్ చేస్తూ ఉంటారు. అయితే గ్యాస్ సిలెండర్ లో గ్యాస్ ఏ లెవెల్ వరకు ఉందో ఎలా తెలుసుకోవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఈ చిన్న ట్రిక్స్ తో ఈజీగా గ్యాస్ సిలిండర్లో ఎంతవరకు గ్యాస్ ఉంది అనేది తెలుసుకోవచ్చు. ఒక క్లాత్ తీసుకుని నీటిలో తడిపేసి సిలిండర్ చుట్టూ చుట్టాలి కొంత సమయం తర్వాత క్లాత్ ని తొలగించాలి సిలిండర్ ని చూస్తే కొంత భాగం తడిగా కొంత భాగం పొడిగా కనబడుతుంది. తడిగా ఉన్న భాగం వరకు గ్యాస్ ఉన్నట్లు.
పొడిగా ఉన్న భాగంలో గ్యాస్ లేనట్లు మీరు అర్థం చేసుకోవాలి ఇలా ఎంతవరకు గ్యాస్ ఉంది అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. ఒక గ్లాసులో గోరువెచ్చని నీళ్లు తీసుకుని గ్యాస్ సిలిండర్ అంచున పొయ్యాలి. నీళ్లు పోసిన ప్లేస్ లో చేయి పెట్టి చూస్తే కొంతవరకు తడిగా మరి కొంత వరకు పొడిగా ఉంటుంది. తడిగా ఉన్న భాగంలో గ్యాస్ ఉందని మీరు అర్థం చేసుకోవాలి పొడిగా ఉన్నట్లయితే అందులో గ్యాస్ లేనట్లు అర్థం చేసుకోవాలి. ఇలా ఈ చిన్న ట్రిక్స్ తో మీరు గ్యాస్ సిలిండర్ లో గ్యాస్ ఎంత దాకా ఉందని తెలుసుకోవచ్చు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!