Advertisement
బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘వీరసింహారెడ్డి’. శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన వీరసింహారెడ్డి తొలిరోజు రికార్డ్ బ్రేక్ కలెక్షన్స్ సాధించింది. ఇప్పటికే 50 రోజుల థియేట్రికల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రన్ ముగిసింది. అఖండ వంటి మాసివ్ హిట్ తర్వాత బాలయ్య అభిమానులకు వీరసింహారెడ్డి మంచి ట్రీట్ ఇచ్చారు.
Advertisement
Read also: హిట్ అవ్వాల్సిన ఎన్టీఆర్ సినిమా ఆ స్టార్ హీరో కారణంగా అట్టర్ ప్లాప్ అయిన మూవీ ఏదంటే ?
ప్రస్తుత పరిస్థితుల్లో 50 రోజులపాటు ఓ సినిమా థియేటర్లలో నాన్ స్టాప్ రన్ కొనసాగించడం అరుదే అయినా వీరసింహారెడ్డి ఆ ఫీట్ అలవోకగా అధిగమించడం విశేషం. మొత్తంగా 23 డైరెక్ట్, 54 షిఫ్టింగ్ థియేటర్లలో వీరసింహారెడ్డి 50 రోజుల యాత్ర నడిచింది. అయితే ఈ వీరసింహారెడ్డి సినిమాలో బాలకృష్ణ రాయలసీమ ఫ్యాక్షనిస్టుగా నటించాడు. అయితే బాలయ్య పాత్రపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. అదేంటంటే, ఈ సినిమాలో మెయిన్ విలన్ తండ్రి, తనకు వీరసింహారెడ్డి ఎవరో తెలియదంటూ సినిమాలో డైలాగ్ చెబుతాడు.
Advertisement
ఎవడ్రా నా ఊరొచ్చి నన్ను ముట్టె మగాడు, అంటూ బాలకృష్ణను నిలదీస్తాడు. దానికి సమానంగా నేనే వీరసింహారెడ్డి, పుట్టింది పులిచెర్ల, చదివింది అనంతపూర్, రూలింగ్ కర్నూల్ అంటూ బాలయ్య ఆ విలన్ కు సమాధానం ఇస్తాడు. అయితే ఈ డైలాగ్ పైనే ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. రాయలసీమలో ఉన్నది నాలుగు జిల్లాలే. అందులో వీరసింహారెడ్డి పేరు అందరికీ తెలుస్తుంది. కానీ విలన్ ఆ మగాడు ఎవడు అంటూ, వీరసింహారెడ్డి గురించి ఏమీ తెలియదన్నట్లు డైలాగ్ చెబుతాడు. పక్కూరికి కూడా తెలియని వీరసింహారెడ్డి, ఏం ఫ్యాక్షనిస్ట్ అయ్యా అంటూ ట్రోల్ చేస్తున్నారు.
Read also: ఎన్టీఆర్ మరణానికి, తారకరత్న మరణానికి ఇద్దరిలో ఉన్న కామన్ పాయింట్స్ గమనించారా?