Advertisement
TSPSC Group 1 Final Key: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 503 గ్రూప్ 1 పోస్టులకు అక్టోబర్ 16న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన తుది ఆన్సర్ ‘కీ’ మంగళవారం విడుదలైంది. గ్రూప్ 1 ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’ లో ఐదు ప్రశ్నలను తొలగించినట్లు కమిషన్ పేర్కొంది. మరో రెండు ప్రశ్నలకు రెండు కన్నా ఎక్కువ సమాధానాలు సరైనవిగా ప్రకటించింది. అక్టోబర్ 29న విడుదలైన గ్రూప్ 1 ప్రైమరీ ఆన్సర్ ‘కీ‘ పై వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
Advertisement
అక్టోబర్ 30 నుంచి నవంబర్ 4 వరకు స్వీకరించిన అభ్యంతరాలను సబ్జెక్టు ఎక్స్పర్ట్స్ కమిటీ పరిశీలించి, 5 ప్రశ్నలను తొలగించింది. గ్రూప్-1 ప్రిలిమినరీ మాస్టర్ ప్రశ్నాపత్రం ప్రకారం 29, 48, 69, 82, 138 ప్రశ్నలను తొలగించింది. 107 వ ప్రశ్నకు ఆప్షన్ 1 లేదా 2 లేదా 3 లేదా 4 లో ఏది పేర్కొన్న ఒక మార్కు ఇవ్వనుంది. అలాగే 133వ ప్రశ్నకు ఒకటి లేదా రెండు ఈ రెండింట్లో ఏ ఆప్షన్ గుర్తించిన మార్కులు ఇస్తారు. 57వ ప్రశ్నకు సమాధానాన్ని మార్చి ఆప్షన్ ఒకటిగా సవరించింది.
Advertisement
TSPSC Group 1 Final Key
ఈ విధంగా గ్రూపు వన్ పరీక్షలో మొత్తం 150 మార్కులకు ఐదు ప్రశ్నలను తొలగించడంతో 145 ప్రశ్నలకు వచ్చిన మార్కులను పరిగణలోకి తీసుకొనున్నారు. ఒక్కో ప్రశ్నకు 1.034 మార్కులను కేటాయించి దమాషా పద్ధతిలో తుది ఫలితాలను ప్రకటిస్తారు. నవంబర్ 29వ తేదీ వరకు ఓఎంఆర్ షీట్లను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయని, అభ్యర్థులు లాగిన్ అయ్యి డౌన్ లోడ్ చేసుకోవచ్చని కమిషన్ తెలిపింది. ఈ పరీక్షను 2,86,051 మంది రాశారు. ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్ కు ఎంపిక చేయనున్నారు.
READ ALSO : T20 WC 2022 : ఛాంపియన్ ఇంగ్లండ్‌కు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే..? భారత్‌కు మరి!