Advertisement
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసుపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఫోకస్ పెంచింది. ఈక్రమంలోనే టీఎస్పీఎస్సీ ఉద్యోగులకు నోటీసులు జారీ చేసింది. అసిస్టెంట్ సెక్రెటరీ సత్యనారాయణ, శంకర లక్ష్మిలకు నోటీసులు పంపింది. అంతేకాకుండా.. సిట్ అదుపులో ఉన్న నిందితులను తమ కస్టడీకి అప్పగించాలని కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
Advertisement
ఇప్పటికే ఈ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పుడు ఈడీ ఎంట్రీతో ఎప్పుడేం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. ఇటు సిటి అధికారులు టీఎస్పీఎస్సీ కేసు విచారణ నివేదికను సీల్డ్ కవర్ లో హైకోర్టుకు సమర్పించారు. ఈ కేసులో ఏ1, ఏ2 లుగా ఉన్న ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిల పైనే అధికారులు నివేదికలో ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారుల నిర్లక్ష్యాన్ని క్యాష్ చేసుకున్న వీరు.. లీక్ కు పాల్పడినట్లు నివేదికలో అధికారులు పేర్కొన్నారు.
Advertisement
పేపర్ లీకేజీపై హైకోర్టులో విచారణ కొనసాగింది. ఎన్ఎస్‌యూఐ నేత బల్మూరి వెంకట్ పిటిషన్ పై విచారణ జరిపింది. హైకోర్టుకు దర్యాప్తు వివరాలు సీల్డ్ కవర్ లో సమర్పించింది సిట్. 18 మంది నిందితుల్లో 17 మందిని అరెస్ట్ చేసినట్టు తెలిపింది. న్యూజిలాండ్ లో ఉన్న మరో నిందితుడి అరెస్టుకు ప్రయత్నం జరుగుతోందని ఏజీ కోర్టుకు తెలిపారు. దర్యాప్తు పారదర్శకంగా జరుగుతోందని చెప్పారు.
అయితే.. పరీక్షల నిర్వహణ సంబంధం ఉన్నవారిని పరీక్షలకు అనుమతించారా? లేదా అని హైకోర్టు ప్రశ్నించింది. అలాగే, పరీక్షల నిర్వహణ ఔట్ సోర్సింగ్ బాధ్యతలు ఏ సంస్థకు ఇచ్చారు? అని అడిగింది. తర్వాత తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది హైకోర్టు. ఈ కేసులో సిట్ అధికారులు టీఎస్పీఎస్సీ ఉద్యోగులతో పాటు ఛైర్మన్, కార్యదర్శి, సభ్యులను కూడా విచారించారు. మొత్తం 150 మందిని విచారించి వారి స్టేట్ మెంట్స్ ను రికార్డు చేసి.. ఆ నివేదికను హైకోర్టు ముందు ఉంచారు.