Advertisement
సినిమా ఇండస్ట్రీ.. అదో రంగుల ప్రపంచం. ఇక్కడ టాలెంటే కాదు లక్కు కూడా ఉండాలి. లేదంటే రోజులు గడుస్తాయే గానీ, అవకాశాలు రావు. ఎంతోమంది సినీ లోకాన్ని ఏలదామని కలలు కంటూ ఉంటారు. కానీ, వారిలో కొందరికే కలిసొస్తుంది. అలాంటి వారిలో తునీషా శర్మ ఒకరు. బాలనటిగా ఆరంగేట్రం చేసిన ఈమె.. మరాఠీ బుల్లితెర రాణిగా పేరొందింది. తక్కువ సమయంలో ఎక్కువ క్రేజ్ సంపాదించింది. సినిమాల్లోనూ చేస్తూ తనదైన నటనతో ఆకట్టుకుంటూ ఉంది.
Advertisement
అయితే.. ఈమె ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. మహారాష్ట్రలోని పల్ఘర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. సీరియల్ షూటింగ్ జరుగుతున్న సెట్ లో ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించిందని వైద్యులు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లాంటిదేది లభించలేదు. ఆత్మహత్యతో పాటు హత్యాకోణంలో కూడా విచారణ జరుగుతోంది.
Advertisement
తునీషా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. నాలుగు రోజుల క్రితం కూడా ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్ చేసింది. ఎంతో అందంగా నవ్వుతున్న ఫోటోను పోస్ట్ చేసింది. “ఈ క్షణంలో సంతోషంగా ఉండండి.. అది చాలు’’ అనే క్యాప్షన్ ఇచ్చింది. ఎప్పుడూ చలాకీగా ఉండే తునీషా మరణం తోటి నటీనటులకు షాక్ తగిలినట్లయింది.
బాలనటిగా కెరీర్ ప్రారంభించిన తునీషా.. దాదాపు దశాబ్ద కాలం పాటు పరిశ్రమలో భాగమైంది. 2016లో వచ్చిన ఫితూర్ మూవీతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆ మూవీలో చిన్నప్పటి కత్రినా కైఫ్ పాత్రలో నటించింది. బార్ బార్ దేఖోలో కూడా నటించింది. కహానీ 2లో విద్యాబాలన్ తో కూడా స్క్రీన్ ను షేర్ చేసుకుంది.