Advertisement
జూనియర్ కొరియోగ్రాఫర్ కేసులో జానీ మాస్టర్ ఆయన తన నేరాన్ని అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కేసులో ఒక ట్విస్ట్ నెలకొంది. మహిళా కొరియోగ్రాఫర్ పై దాడి చేశారని ఆరోపణలు నేపథ్యంలో ఆయన భార్య ఆయేషా పైనా చర్యలు తీసుకోవడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే యువత అత్యాచారం కేసులో అతన్ని అరెస్ట్ చేశారు. చంచల్ గూడ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో కేసు మరో కీలక మలుపు తిరిగే ఛాన్స్ కనపడుతోంది.
Advertisement
జూనియర్ కొరియోగ్రాఫర్ కంప్లైంట్ చేస్తూ జానీ మాస్టర్ అత్యాచారం చేశారని ఆయన భార్య తనపై దాడి చేసిందని బాధితురాలు చెప్పింది. ఆయేషా తన ఇంటికి వచ్చి దాడి చేసినట్లు యువతి ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఈ కేసులో చేర్చాలని పోలీసులు నిర్ణయించుకున్నారు. జానీ భార్యతో పాటుగా ఇంకో ఇద్దరినీ నిందితులుగా చేర్చే అవకాశం ఉంది.
Advertisement
Also read:
ఈరోజు ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్ ని కస్టడీకి కోరుతూ నార్సింగి పోలీసులు పిటిషన్ వేయబోతున్నారు. రిమాండ్ రిపోర్టులో అంశాలని పోలీసులు పరిశీలిస్తున్నారు. బాధితురాలు ఇచ్చిన 40 పేజీల ఫిర్యాదు పైన సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు కస్టడీని కోరనున్నారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!