Advertisement
Salaar Part 2 &3 : బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ హిట్ కోసం ట్రై చేశారు. కానీ సరైన హిట్టు రాలేదు. బాహుబలి సినిమా తర్వాత అంత హిట్ ప్రభాస్ కి సలార్ సినిమా ఇచ్చింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా డిసెంబర్ 22న తెర మీదకి వచ్చింది. ఈ సినిమా తెర మీదకి వచ్చినప్పటి నుండి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లని రాబడుతోంది. ఈ సినిమాలో అంతు చిక్కని ప్రశ్నల గురించి ఇప్పుడు చూద్దాం. సమాధానాలు చెప్పకుండా వాటిని ప్రశ్నలు గానే మిగిల్చేసారు. ఈ సినిమాలో శృతిహాసన్ తన తండ్రికి చెప్పకుండా వచ్చేస్తుంది. ఆమె వచ్చిన వెంటనే విలన్ గ్యాంగ్ ఆమె వెంట పడతారు.
Advertisement
ప్రభాస్ కి చెందిన ఒక వ్యక్తితో శృతిహాసన్ తండ్రి దేవా ఒక్కడే నా కూతురిని కాపాడగలడని ఏడేళ్ల క్రితం మాట ఇచ్చాడని చెప్తాడు. అయితే శృతిహాసన్ నాన్నకి ప్రభాస్ కి ఏదో లింక్ ఉంది. ఒకరికొకరికి పరిచయం ఉంది. అసలు వాళ్ళ మధ్య సంబంధం ఏంటి అనేది ప్రశ్నగానే మిగిలిపోయింది. అలానే శ్రియ రెడ్డి పాత్రకి ప్రభాస్ కి మధ్య లింక్ ఏంటి అన్నది కూడా చూపించలేదు. వాళ్ళిద్దరికీ లింక్ ఏంటి అనేది తెలియాలి. శృతిహాసన్ తండ్రి ఇండియాకి వచ్చిన తర్వాత శ్రియ రెడ్డికి దగ్గరికి వెళ్తాడు. నీకు కావాల్సింది నేను కదా నా కూతుర్ని వదిలేయమని అంటాడు.
Advertisement
ప్రభాస్ ఎక్కడ ఉన్నాడనేది తెలుసుకోవడానికి తన కూతుర్ని అడ్డుపెట్టుకున్నట్లు చెప్తుంది. ఇవి కూడా పార్ట్ వన్ లో చూపించలేదు. ప్రభాస్ ఎందుకు అలా బతకాల్సివస్తుంది..? ఆ రాజాన్ని వదిలి ఎందుకు వెళ్లిపోయాడు..? ఇవి కూడా దర్శకుడు ఈ పాటలో చూపించలేదు. ఎందుకు దాకోవాల్సి వస్తుంది. అలానే, దేవా ని అతని తల్లి ఎందుకు ఆపుతోంది..? ఇటువంటివన్నీ కూడా ప్రశ్నలు గానే ఉన్నాయి. గొడవలకి వెళ్లకుండా ప్రభాస్ తల్లి ఎందుకు ఆపుతోంది చిన్న ప్లాస్టిక్ కత్తి చూసిన ఆమె ఎందుకు వణికి పోతోంది. మైనింగ్ చోట కూడా ఒక డైలాగ్ చెప్తుంది. ఇలా ఎలివేషన్స్ ఇస్తుంది. ఇలా ఎందుకు జరుగుతోంది..? ప్రభాస్ కి తన తల్లికి మధ్య ఏం జరిగింది ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!