Advertisement
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినా సంగతి విదితమే. అయితే.. బిఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో.. ఆ పార్టీ కి అనుగుణంగా నడుస్తూ వచ్చిన “నమస్తే తెలంగాణ” పత్రిక పరిస్థితి అయోమయంలో పడినట్లయింది. ఈ పత్రిక గురించి వాట్సాప్ లో ఓ మెసేజ్ వైరల్ అవుతూ వస్తోంది. “నమస్తే తెలంగాణ” పత్రిక నుంచి ఇరవై శాతం మంది ఉద్యోగులను తగ్గిస్తున్నట్లు హఠాత్తుగా నిర్ణయం తీసుకున్నారు. మీ సేవలు ఇక నుంచి అవసరం లేదు అంటూ కొందరిని ఉద్యోగం లోంచి తీసేస్తున్నారట.
Advertisement
అయితే.. ఇప్పటివరకు పత్రికపై ఆధారపడి.. పత్రికను నమ్ముకుని బతికిన వారికి హఠాత్తుగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో వారంతా ఏమి చేయాలి అని ఆందోళన చెందుతున్నారు. ముందస్తు నోటిఫికేషన్ ఇవ్వకుండా.. ఇలా ఉన్నపళంగా వెళ్లిపొమ్మని చెప్పడంపై అందరు ఆగ్రహంతో ఉన్నారు. ప్రభుత్వం మారగానే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా? ప్రభుత్వం మారగానే జర్నలిస్ట్ లను రోడ్డు మీదకి లాగే విధానాలను మార్చుకోవాలి అతను డిమాండ్ చేస్తున్నారు.
Advertisement
ఉన్నట్లుండి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమ అవసరాల కోసమే ఈ పత్రిక ఉద్భవించింది. కానీ, క్రమేపీ టిఆర్ఎస్ పార్టీ పత్రికగా.. ఆ పార్టీ ప్రచారానికే ఎక్కువ ఉపయోగపడుతూ వస్తోంది. కానీ, ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయింది. అయితే.. ఇప్పుడు ఆ పత్రిక నుంచి జర్నలిస్ట్స్ ను తప్పించడం అన్యాయంగా కనిపిస్తుంది. నిజానికి.. ఇప్పుడే పార్టీకి పత్రిక అవసరం ఎక్కువ ఉంటుంది. అధికారంలో ఉన్న పార్టీకి బలమైన ప్రతిపక్షం ఉండాలి. అందుకు ప్రజల్లోకి వాయిస్ తీసుకెళ్లే పత్రిక ఒకటి ఉండాలి. అటువంటి పత్రికకు ఇప్పుడు తూట్లు పొడవడం సమర్ధించాల్సిన నిర్ణయమేనా? అని పలువురు భావిస్తున్నారు.
Read More:
బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ! వీళ్ళకి జరిగింది మరెవరికి ఇలా జరగదు ఏమో ? అదృష్టం ఉండాలి బాస్ !
పిల్లర్ నెంబర్ 9 రైల్వే స్టేషన్ ! ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ
ఎన్టీఆర్ తన పిల్లల స్కూల్ ఫీజ్ కోసం ఇంత ఖర్చు చేస్తున్నారా? ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!