Advertisement
జీవనోపాధి కోసం భూక్యా మహేష్, లతా దంపతులు హైదరాబాద్ వచ్చారు. ఈ క్రమంలో భార్య లతా భర్త స్నేహితుడు విక్రమ్ కు దగ్గరయింది. చివరకు వీరిద్దరూ కలిసి మహేష్ ను హ*త్య చేసేవరకు వీరి వ్యవహారం వచ్చింది. కేపీహెచ్‌బీ పోలీసుల కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండ్లరేవు పరిధిలోని జూలూరుపాడు రేంజ్‌కు చెందిన భూక్యా మహేష్ క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అతనికి అదే జిల్లా పాల్వంచ మండలం కరకవాగుకు చెందిన లతతో పెళ్లి అయ్యింది. వీరికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు.
Advertisement
ఆరు నెలల కిందటే కేపీహెచ్‌బీ హైదర్‌నగర్ పరిధిలోని రాంనరేష్నగర్కు వచ్చారు. గతంలో మహేష్ కు రెండు సార్లు పక్షవాతం వచ్చింది. చికిత్స కూడా తీసుకుంటున్నాడు. ఓ సారి మరో క్యాబ్ డ్రైవర్ అయిన విక్రమ్ ను నమ్మకం కొద్దీ ఇంటికి తీసుకొచ్చి లతని పరిచయం చేసాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య బంధం బలపడింది. దీనితో మహేష్ ను అడ్డు తొలగించుకోవాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా మహేష్ ను ఉరి వేసి చంపేశారు. అయితే.. మూర్ఛతో చనిపోయినట్లు చుట్టూ పక్కల వారిని నమ్మించాలని అనుకున్నారు.
Advertisement
ఆ సమయంలోనే ఓ వైద్యుడిని పిలిపించి భర్తకి మూర్ఛ వచ్చిందని లతా తెలిపింది. ఆ వైద్యుడు పరీక్షిస్తున్న సమయంలో మహేష్ నాడి స్లో గా కొట్టుకుంటూ ఉండడంతో.. ఆసుపత్రికి తరలించాలని సూచించాడు. అయితే.. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూనే మహేష్ మరణించాడు. కానీ పోస్ట్ పార్టమ్ రిపోర్ట్ లో మహేష్ ది సహజ మరణం కాదని.. ఉరి వేయడం వలనే మరణించాడని తేలింది. దీనితో పోలీసులు రంగంలో దిగారు. తమ స్టయిల్ లో ప్రశ్నించగా.. లతా అసలు విషయాలు చెప్పింది. దీంతో పోలీసులు లత(23)ని అదుపులోకి తీసుకున్నారు. మహేష్ మరణిస్తే.. లతా జైలుపాలైంది. వారి పిల్లలు దిక్కు మొక్కు లేని వారు అయ్యారు. విక్రమ్ మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
- మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ చూడండి ! Telugu News కోసం ఇవి చుడండి !