Advertisement
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు-త్రివిక్రమ్ అప్ కమింగ్ మూవీ పై ప్రేక్షకులకు బోలెడు అంచనాలు ఉన్నాయి. అరవింద సమేత, అలా వైకుంఠపురం చిత్రాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న గురూజీ ఇప్పుడు మహేష్ బాబు తో మూవీ అనేసరికి అంచనాలు రెట్టింపు అయ్యాయి. మహేష్ బాబు వరసహిట్లతో దూకుడు మీద ఉన్నాడు. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట, ఇలా హిట్లమీద హిట్లు కొట్టుకొని పోతూ, తనకి లక్కీ డైరెక్టర్ త్రివిక్రమ్ తో SSMB28 మూవీ చేస్తున్నారు.
Advertisement
READ ALSO : రోహిత్ పై అంపైర్ నితిన్ ప్రేమ.. కోహ్లీపై వివక్ష..!
అయితే ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబు మాట్లాడుతూ తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన షాకింగ్ విషయాలను వెల్లడించారు. నాకు తెలుగు చదవడం, రాయడం రాదని మహేష్ తెలిపారు. డైరెక్టర్ చెప్పిన డైలాగ్స్ ను విని తాను డైలాగులను చెబుతానని సూపర్ స్టార్ మహేష్ బాబు చెప్పుకొచ్చారు. మహేష్ చెప్పిన ఈ విషయం నెట్టింట వైరల్ అవుతోంది. కాగా దర్శకుడు కొరటాల శివ ఒక సందర్భంలో మాట్లాడుతూ, మహేష్ మెమొరీ కిల్లర్ మెమొరీ అని రెండుసార్లు డైలాగు వింటే మహేష్ కు ఆటోమేటిక్ గా గుర్తుంటుందని కొరటాల శివ చెప్పుకొచ్చారు.
Advertisement
READ ALSO : మన టాలీవుడ్ తారలు.. వారి మధ్య ఉన్న బంధుత్వాలు
ఈ కాంబినేషన్లో శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలు తెరకెక్కాయి. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఒక సినిమాను మించి మరొకటి హిట్ కావడంతో పాటు అటు మహేష్ కు ఇటు కొరటాల శివకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. రాజకీయాలపై పెద్దగా ఆసక్తి చూపని మహేష్ బాబు సినిమాలకే పూర్తిస్థాయిలో ప్రాధాన్యత ఇస్తున్నారు. మహేష్ ప్రస్తుతం తన ఫేవరెట్ డైరెక్టర్లలో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు.
READ ALSO : దేవుడి ఉంగరాలు చేతికి దరిస్తున్నారా అయితే ఒక్కసారి ఇవి తెలుసుకోండి !