Advertisement
సన్నీ లియోన్.. ఈ పేరు వింటేనే అందరికీ శృ$$$ర తారగానే గుర్తుకు వస్తుంది. ఈమె పేరు చెబితే పులకరించని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు ఈమె శృ^^^ర తార అయినప్పటికీ ఇప్పుడు ఆ చేదు జ్ఞాపకాలని చెరిపేసుకొనే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం సన్నీ లియోన్ సినిమాలలో నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. తన గతాన్ని పక్కన పెట్టేసి మర్యాదపూర్వకంగా బ్రతకాలని ఆశపడుతుంది. అయితే అందరికీ తెలిసిన సన్నీ వేరు.. మనం తెలుసుకోవలసిన సన్నీ వేరు. సన్నీలియోన్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. సన్నీలియోన్ తండ్రి టిబేట్ లో పుట్టిన ఓ సిక్కు మతస్థుడు. ఆయన ఢిల్లీలో పెరిగారు. ఈమె తల్లి హిమాచల్ ప్రదేశ్ కి చెందింది. ఈ దంపతులకు 1981 మే 13న సన్నీలియోన్ జన్మించింది. ఈమె అసలు పేరు కరేన్ మల్హోత్రా.
Advertisement
Read also: గుర్తు తెలియని వ్యక్తితో భార్య చాటింగ్ భర్త తిట్టినందుకు ఆమె చేసిన పిచ్చి పని ఏంటంటే ?
Advertisement
సన్నీ లియోన్ పుట్టకముందే ఆమె తల్లిదండ్రులు కెనడాలో స్థిరపడ్డారు. కెనడాలో పుట్టి పెరిగినందుకు ఆమెను ఇండో కెనడియన్ అని పిలుస్తారు. ఇక సన్నీలియోన్ సిక్కు వర్గానికి చెందిన వ్యక్తి. ఆమె భర్త అమెరికన్ అయినప్పటికీ ఆమె సిక్కు ఆచారాలను అనుసరిస్తుంది. డేనియల్ అనే వ్యక్తితో ఏడాది పాటు డేటింగ్ చేసి వివాహం చేసుకుంది సన్నిలియోన్. అయితే ఈ దంపతులు నిషా అనే అమ్మాయిని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఆ అమ్మాయిని 11 మంది రిజెక్ట్ చేశారు. కానీ సన్నీ ప్రాంతం, రంగు, తన ఆరోగ్య పరిస్థితితో సంబంధం లేకుండా ఆ చిన్నారిని దత్తత తీసుకుంది. నిషాని దత్తత తీసుకున్న తర్వాత సరోగసి ద్వారా ఇద్దరు పిల్లల్ని పొందింది. వారి పేర్లు నోహ్, యాషేర్. సన్నీలియోన్ కి ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. 2011లో జరిగిన బిగ్ బాస్ 5 రియాలిటీ షోలో పాల్గొన్న సన్నీలియోన్.. ఆ తర్వాత బాలీవుడ్ నటిగా అవకాశం అందుకుంది. జీస్మ్ 2 ఈమె మొదటి హిందీ చిత్రం. ఈ చిత్రం ప్రీ రిలీజ్ అప్పుడు చారిటీ ప్రయోజనాల కోసం లో దుస్తులను అమ్మకానికి పెట్టినట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కానీ అది సినిమా ప్రమోషన్స్ కోసం అని చెప్పడంతో చాలామంది విమర్శించారు. కానీ అసలు విషయం ఏమిటంటే తన లో దుస్తులు అమ్మగా వచ్చిన డబ్బులను క్యాన్సర్ స్వచ్ఛంద సంస్థకు సన్నిలియోన్ విరాళంగా ఇచ్చేసింది. అలాగే ముంబైలోని ఓ పాఠశాలను దత్తత తీసుకొని ఆ పాఠశాలలో చదువుకునే పేద విద్యార్థుల బాగోగులను తానే స్వయంగా చూసుకుంటుంది. ఆ పాఠశాలలో ఇప్పటివరకు 300 మందికి పైగా విద్యార్థులు లబ్ధి పొందినట్లు సమాచారం. ఇక వృద్ధులకు సేవ చేయడం, వారికి సహాయం చేయడం దేవుడికి సేవ చేయడంతో సమానం అని సిక్కు మతం చెప్తుంది. దాని ప్రకారమే ఒక వృద్ధ జంటని సన్నిలియోన్ దత్తత తీసుకొని వారి బాగోగులను తానే చూసుకుంటుంది. ఇక సన్నీ జంతు ప్రేమికురాలు అన్న విషయం మనకు తెలిసిందే. వీధి కుక్కల సంరక్షణ ఎప్పటికప్పుడు చేపడుతూ ఉంటుంది సన్నీలియోన్.
Read also: యాక్సిడెంట్ తరువాత డ్రైవర్ తో పంత్ మాట్లాడిన మొదటి మాట ఇదే! వింటే కన్నీళ్లు ఆగవు..