Ads
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్ర మూడో విడుత షెడ్యూల్ ఖరారు అయింది. ఆగస్టు 10 నుంచి వారాహి యాత్ర తిరిగి ప్రారంభంకానుంది. ఇక ఈ సారి విశాఖ నుంచి ప్రారంభమై ఆగస్టు 19 వరకు కొనసాగనుంది. మొదటి, రెండో విడుత యాత్రలు వెంట వెంటనే జరిపిన పవన్ కళ్యాణ్.. మూడో విడుత టూర్ కి కాస్త గ్యాప్ తీసుకున్నారు. జూన్ 14, జులై 09 ప్రారంభమైన రెండు విడుతల్లో ఉమ్మడి గోదావరి జిల్లాలు టార్గెట్ గా ముందుకు వెళ్లారు. గోదావరి జిల్లాలలో 34 సీట్లు గెలావాలని పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు.
Advertisement
మూడో విడుత కూడా గోదావరి జిల్లాల్లో ఉంటుందని తొలుత అనుకున్నప్పటికీ వరదల కారణంగా ఉత్తరాంధ్రకు మార్చారు. విశాఖపట్టణం నుంచి ప్రారంభం అయ్యే టూర్ ఉమ్మడి జిల్లాలో పలు నియోజకవర్గాల్లో కొనసాగనుంది. ఏయే నియోజకవర్గాలలో పర్యటించేది త్వరలో ప్రకటిస్తామని జనసేన వర్గాలు తెలిపాయి. గత ఎన్నికల్లో ఉమ్మడి విశాఖ జిల్లా గాజువాక నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓడిపోయాడు. ఈ జిల్లాలో జనసేనకు క్యాడర్ బాగానే ఉంది. విశాఖ నుంచి టూర్ ప్రారంభించాలని పవన్ నిర్ణయించారు.
ఇదిలా ఉండగా..వారాహి విజయ యాత్ర ద్వారా జనసేనలో కొత్త ఊపు తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్. మొదటి విడుతలో 10 నియోజకవర్గాలు, రెండో విడుతలో 5 నియోజకవర్గాల్లో పర్యటించారు.మూడో విడుతలో కూడా ఇదే తరహాలో ముందుకు వెళ్లనున్నారు. ఆగస్టు 10న విశాఖలో వారాహి వాహనం నుంచి బహిరంగ సభలో పాల్గొంటారు పవన్ కళ్యాణ్. యాత్రలో భాగంగా క్షేత్రస్థాయి పరిశీలనలు, విశాఖలో చోటు చేసుకుంటున్న భూకబ్జాలకు సంబంధించిన పరిశీలనలుంటాయని జనసేన వర్గాలు వెల్లడించాయి.