Advertisement
కొంతమంది సక్సెస్ ని చూస్తే శభాష్ అని అనాలి అని ఉంటుంది. ప్రతి ఒక్కరి సక్సెస్ స్టోరీ ఎంతో మందిలో స్ఫూర్తి నింపుతుందన్న విషయం మనకు తెలిసిందే. సీఏ పరీక్షల్లో పాస్ అవడం అంటే ఈజీ కాదు. చాలా మంది సీఏ పరీక్ష పాస్ అవ్వడం కోసం అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. సీఎం పరీక్షల్లో పాస్ అవ్వడం కోసం చాలామంది రాత్రి పగలు కష్టపడుతున్నారు. పిల్లల సక్సెస్ తల్లిదండ్రులకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మహారాష్ట్ర రాష్ట్రంలోని లోథానేలోని డోంబివిలిలో చోటు చేసుకున్న ఘటన ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది.
Advertisement
థోబ్రే మావ్షి కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు. ఆమె కొడుకు యోగేష్ సీఏ పరీక్షల్లో పాసయ్యారు. ఈ గుడ్ న్యూస్ ని తల్లితో పంచుకున్న వెంటనే ఆమె కొడుకుని కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకుంది. డిపార్టుమెంట్ మంత్రి రవీంద్ర చౌహాన్ ట్విట్టర్ వేదికగా సంబంధించిన వీడియో ని పోస్ట్ చేశారు. యోగేష్ మిమల్ని చూసి ఎంతో గర్వపడుతున్నాను.
Advertisement
Also read:
Also read:
బిగ్ బాస్ ఒక చెత్త షో… వేణుస్వామి సంచలన కామెంట్స్..!
బలం దృఢ సంకల్పంతో యోగేష్ ఎంతో కష్టపడి అద్భుతమైన విషయాన్ని సాధించారు అని ఆయనను మంత్రి అభినందిస్తున్నారు. యోగేష్ రాబోయే రోజుల్లో కెరియర్ పరంగా మరింత ఎదగాలని నెటిజెన్లు కోరుకుంటున్నారు. ఎంతో కష్టపడి మరెన్నో విజయాలని సొంతం చేసుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. యోగేష్ రాబోయే రోజుల్లో మరెన్నో విజయాలను అందుకోవాలని కోరుకుందాం.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!