Advertisement
టీమిండియాను ప్రస్తుతం గాయాలు వేధిస్తున్నాయి. ఇప్పటికే ఈ గాయాల కారణంగా..జడేజా, బుమ్రా, దీపక్ చాహర్ లాంటి కీలక ప్లేయర్లు జట్టులో స్థానం కోల్పోయారు. అలాగే.. ప్రపంచ కప్ ను మిస్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే.. టీమిండియాకు మరో షాక్ తగిలింది. టీమిండియా యంగ్ స్టర్ వెంకటేష్ అయ్యర్ నడవలేని స్థితిలో ఉన్నాడు. ఎడమ కాలికి పెద్ద కట్టుతో లెగ్ వాకర్ సహాయంతో నడుస్తున్నాడు. ఈ ఫోటోను ఐపీఎల్ ఫ్రాంచైజ్ కోల్కత్తా నైట్ రైడర్స్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. దీంతో అయ్యర్ కు ఏమైందని క్రికెట్ అభిమానులు కంగారు పడుతున్నారు.
Advertisement
కాగా ముస్తాక్ అలీ ట్రోఫీ 2022లో భాగంగా వెంకటేష్ అయ్యర్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతను ఈ టోర్నీకి పూర్తిగా దూరమయ్యాడు. అయ్యర్ కాలి గజ్జల్లో ఎముక చిట్టినట్టు తెలుస్తుంది. దీంతో అతనికి ఆరువారాలపాటు విశ్రాంతి అవసరమని వైద్యులు నిర్ధారించారు. కాలికి చికిత్స తీసుకున్న అయ్యర్, ఇంట్లో ఒక నెల పాటు విశ్రాంతి తీసుకోనన్నాడు.
Advertisement
ఇంట్లో నెలరోజుల పాటు విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్ళనున్నాడు. అక్కడే ఉండి కాలికి చికిత్స తీసుకోవడంతో పాటు తిరిగి ఫిట్నెస్ సాధించనున్నాడు. కాగా, ఐపీఎల్ 2021 సీజన్ లో అద్భుత ప్రదర్శన కనబరిచిన వెంకటేష్ అయ్యర్ ఆల్ రౌండర్ గా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. అదే సమయంలో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఫామ్ లేమి గాయాలతో టీమ్ ఇండియాలో స్థానం కోల్పోవడంతో అయ్యర్ కు అవకాశాలు తలుపు తట్టాయి. కానీ, అయ్యర్ ఆశించిన స్థాయిలో రాణించలేదు. దీంతో జట్టులో స్థానం కోల్పోయాడు. అలాగే ఐపీఎల్ 2022లో కూడా పెద్దగా రాణించలేదు. కాగా, ఇటీవల ముగిసిన రంజి ట్రోఫీలో వెంకటేష్ అయ్యర్ పై బౌలర్ దాడి చేసి గాయపరిచిన విషయం తెలిసిందే.
READ ALSO : పవన్ కల్యాణ్ 3 పెళ్లిళ్లపై జగన్ కౌంటర్..అలా చేస్తే ఏపీ మహిళల పరిస్థితి ఏంటి !