Advertisement
శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత మరియు విజయ్ దేవరకొండ జంటగా నటించిన ఖుషి సినిమా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో దర్శకుడు పూర్తిగా యూత్ ను టార్గెట్ చేసి రూపొందించినట్లుగా. సెప్టెంబర్ 1న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయిన ఖుషి మూవీ సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
Advertisement
ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో చిత్ర బృందం సక్సెస్ ను సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఇక విజయ్ దేవరకొండ కూడా సోషల్ మీడియాలో తనదైన స్టైల్లో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. విజయ్ అభిమానుల సైతం గీత గోవిందం తర్వాత ఆ రేంజ్ లో మీ విజయాన్ని చూస్తున్నాం అంటూ విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా ఆనందంగా అభిప్రాయపడుతున్నారు.
విజయ్ తాజాగా ఖుషిలోని తన డైలాగ్‌ను ఉద్దేశిస్తూ ఒక ఆసక్తికర పోస్ట్ చేశాడు. ఇక ఆ పోస్ట్‌కు తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ రిప్లై ఇచ్చాడు. ఇటీవల విడుదలైన బేబీ చిత్రంతో ఆనంద్ దేవరకొండ కూడా సూపర్ హిట్ సక్సెస్ సొంతం చేసుకున్నాడు. విజయ్ దేవరకొండ ఖుషి, ఆనంద్ దేవరకొండ బేబీ చిత్రాలు హిట్ అవ్వడంతో వారిద్దరికీ ఈ డైలాగ్ బాగా కలిసి వచ్చిందంటూ ఓ పోస్ట్ వైరల్ గా మారింది. ఆ పోస్ట్ ని స్వయంగా విజయ్ దేవరకొండ తన X అకౌంట్ ద్వారా షేర్ చేశారు.
Advertisement
అర్జున్ రెడ్డి చిత్రంలో విజయ్ దేవరకొండ అది నా పిల్ల అని వాడిన డైలాగ్ ప్రేక్షకులలో ఎంత క్రేజ్ సంపాదించుకుందో వేరే చెప్పనవసరం లేదు. బేబీ చిత్రంలో కూడా ఆనంద్ దేవరకొండ అది నా పిల్ల రా అనే డైలాగ్ చెప్పడంతో ఈ సినిమా కూడా హిట్ అయిందని, ఇక ఇదే డైలాగ్ ని ఖుషి సినిమాలో కూడా విజయ్ దేవరకొండ రిపీట్ చేశాడు. ఖుషి చిత్రం కూడా సూపర్ హిట్ సక్సెస్ గా నిలిచింది. దీంతో అన్నదమ్ములు ఇద్దరికీ ఈ డైలాగ్ బాగా కలిసొచ్చింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి.
Also read :
కృష్ణుడు పాత్రలో మెప్పించిన.. 16 మంది టాలీవుడ్ హీరోలు వీళ్ళే..!
విజయ్ దేవరకొండ: నష్టాల గురించి మీరు అడుగుతున్నారు ? ఇదే వారినైతే అడిగేవారా? ?
Kushi : ఖుషి చిత్రంలో సమంత కన్నా ముందుగా అనుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..?
😂
'Adi na pilla' is an emotion ❤️ https://t.co/alRRkOK8l2— Vijay Deverakonda (@TheDeverakonda) August 26, 2023