Ads
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో విజయ్ దేవరకొండ క్రేజ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన తక్కువ టైమ్ లోనే పాన్ ఇండియా లెవెల్ లో పేరు సంపాదించుకున్నారు. విజయ్ దేవరకొండ కోసం హీరోయిన్లే కొట్టుకు చస్తున్నారు అంటే.. ఆయన రేంజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి వారు ఎంతో కష్టపడితే గాని రానిఇమేజ్ విజయ్ దేవరకొండ కు చాలా తక్కువ సమయంలోనే తెచ్చుకున్నారు. మరి అంత హ్యాండ్సమ్ గా ఉండే హీరో అంటే ఎవరైనా ఇష్టపడతారు. ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్,జాన్వీ కపూర్ కూడా విజయ్ హ్యాండ్సమ్ గురించి మాట్లాడారు.
ఇలా ఉండగా విజయ్ దేవరకొండ కోసం సామాన్య అమ్మాయిల నుంచి స్టార్ హీరోయిన్ ల వరకు ఎంతో మంది ఇష్టపడతారు. ఇంతమంది అమ్మాయిలు ఆయనను ఇష్టపడుతుంటే విజయ్ మాత్రం ఎవరిని ఇష్టపడుతున్నారనే విషయంపై ఆరా తీయగా, ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో చూద్దాం.. రీసెంట్ గా కాఫీ విత్ కరణ్ షో కి విజయ్ దేవరకొండ అనన్య పాండేతో కలిసి వెళ్లారు. ఈ షోకు సంబంధించి ప్రోమోలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్లియర్ సమాధానమిస్తూ ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఈ క్రమంలోనే ఎవరితోనైనా లవ్ లో ఉన్నావా అని కరణ్‌జోహార్ అడిగిన ప్రశ్నకు, విజయ్ దేవరకొండ ఇలా సమాధానమిచ్చారు. నేను వివాహం చేసుకొని పిల్లాపాపలతో సంతోషంగా ఉన్న టైంలో ఈ ప్రశ్నకు గట్టిగా సమాధానం చెబుతానని తెలియజేశారు.
Advertisement
అప్పటివరకు ఈ విషయాన్ని నేను బయట చెప్పి ఎవరి మనోభావాలను కించపరచాలనుకోవట్లేదని అన్నారు. ఆ విషయం బయటకు చెబితే చాలామంది హర్ట్ అవుతారని తెలియజేశారు విజయ్. నన్ను ఎంతో మంది ఆరాధిస్తారు. వారి ఫోన్లో నా వాల్‌పేపర్ కూడా పెట్టుకొని ఎంతో అభిమానిస్తారు. అలాంటి ఈ సమయంలో నా ప్రేమ గురించి చెప్పి వారి మనసు ముక్కలు చేయలేనని అన్నారు. దీంతో ఇండైరెక్టుగా తన ప్రేమలో ఉన్నానని ఒప్పుకున్నారు రౌడీ హీరో. ఈ విషయం చెప్పడంతో ఆయన ఎవరితో ప్రేమలో ఉన్నారనే విషయం ఆరా తీయడం మొదలు పెట్టారు నెటిజన్స్.. ప్రస్తుతం ఈ విషయం గురించి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
also read: