Advertisement
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు తన నటనతో అందరి మన్ననలు పొందింది. అలాంటి మీనా బాలనటి గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి 20 సినిమాలకు పైగా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఆ తర్వాత కాలంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి బాలకృష్ణ,చిరంజీవి, వెంకటేష్,నాగార్జున, రజనీకాంత్, కమలహాసన్ వంటి స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. దాదాపు రెండు దశాబ్దాలు పాటు హీరోయిన్ తన కెరీర్ ని కొనసాగించిన మీనా 2009లో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త అయిన విద్యాసాగర్ ను పెళ్లి చేసుకుంది.
also read:రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో తగ్గేదే లేదంటున్న కోమటిరెడ్డి
తన కెరియర్ పీక్స్ లో ఉండగానే తను వివాహ జీవితంలో అడుగు పెట్టింది. వీరికి ఒక పాప కూడా పుట్టింది. అలాంటి మీనా భర్త గత ఏడాది జూన్ లో ఆకస్మిక మరణం పొందాడు. భర్త పోయినప్పటి నుంచి డిప్రెషన్ లోకి వెళ్లిన మీనా ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఆ బాధ నుంచి బయటపడడానికి సినిమాల్లో కూడా నటించడానికి ముందుకు వస్తోంది. ఇదిలా ఉండగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 40 ఏళ్లు అయిన సందర్భంగా మీనా ఒక తమిళ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..
Advertisement
also read:రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో తగ్గేదే లేదంటున్న కోమటిరెడ్డి
తనకి పెళ్ళికి ముందు ఒక హీరో అంటే చాలా ఇష్టం ఉండేదని, తనని ప్రాణంగా ప్రేమించానని అన్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరయ్యా అంటే.. బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ అని చెప్పారు. హృతిక్ రోషన్ లాంటి వ్యక్తి భర్తగా కావాలని అమ్మతో చెప్పానని మీనా అన్నారు. అయితే హృతిక్ రోషన్ కి 2000 సంవత్సరంలో వివాహం జరిగిందని, పెళ్లి వార్త తెలియగానే నా గుండె పగిలినంత పని అయిందని, అప్పటికి నాకు వివాహం కాలేదని చెప్పింది. ప్రస్తుతం ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Advertisement
also read: Sir Movie OTT Release Date, Platform, Streaming Details